Begin typing your search above and press return to search.

ఆ దేశంలో ‘ప్లాస్టిక్’ భామలతో కాపురాలు?

By:  Tupaki Desk   |   9 Dec 2015 4:02 AM GMT
ఆ దేశంలో ‘ప్లాస్టిక్’ భామలతో కాపురాలు?
X
రోజురోజుకీ పెరిగిపోతున్న సాంకేతికత మనిషికి సరికొత్త జీవనాన్ని పరిచయం చేస్తోంది. ఈ ఉదంతం గురించి చదివితే అది ఏ రేంజ్ లో ఉందో తెలుస్తుంది. చైనాలో ఓ చిత్రమైన ట్రెండ్ మొదలైంది. ఇంట్లో కట్టుకున్న పెళ్లాం ఉన్నా.. పిటపిటలాడే అమ్మాయి బొమ్మల్ని కొనుగోలు చేసి వాటితో కాపురం చేసే చిత్రమైన పరిస్థితి మొదలైంది. వినటానికి విచిత్రంగా అనిపించినా ఇది నిజం. బొమ్మతో కాపురం చేయటం ఒక ఎత్తు అయితే.. ఆ బొమ్మల్ని భర్తలకు బహుమతులుగా ఇస్తున్న భార్యల సంఖ్య రోజురోజుకీ పెరగటం మరో ఎత్తు.

అచ్చం మనిషి శరీరం మాదిరే ఉంటే ఈ ప్లాస్టిక్ భామల కాస్త ఖరీదైనా.. కొనేందుకు పెద్దగా వెనుకాడటం లేదు. వయసు మీద పడి.. భర్తలకు ‘ఆ’ సుఖం ఇవ్వటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలు అయితే.. తామే వెళ్లి ఈ బొమ్మల్నికొనుక్కొని వస్తున్నారట. పక్క చూపులు చూడటం.. ఎవరో ఒకరి మీద అయ్యగారి కన్ను పడే ముందే.. ఇంట్లోకి ప్లాస్టిక్ భామను తెచ్చేసి భర్తను కంట్రోల్ లో ఉంచుకోవటం ఈ మధ్య ఓ అలవాటుగా మారిందట.

ఇలా భర్తను సంతృప్తి పరిచే భార్యలు ఒకవైపు.. భార్య కాలం చేస్తే.. ఆమె గురుతుల నుంచి బయటకు రాలేని వారు సైతం ఈ ప్లాస్టిక్ భామల్ని కొనుగోలు చేసి.. వాటికి భార్యల దుస్తులు వేసి.. కాపురం చేసే అలవాటు మొదలైందట. దాదాపు రూ.1.5లక్షల ఖరీదు చేసే ఈ ప్లాస్టిక్ భామల్ని ఈ మధ్య కాలంలో భారీగా కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఇలాంటి ప్లాస్టిక్ సెక్స్ భామల్ని వినియోగించే దుకాణాలు జియాన్ ప్రాంతంలో ఒకప్పుడు చాలా పరిమితంగా ఉంటే.. ఇప్పుడు దాదాపు 2 వేల వరకూ ఉన్నాయంటే వ్యాపారం ఏ రేంజ్ లో సాగుతుందో అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఈ ఒక్క ప్రాంతంలోనే ఏడాదికి పది వేల వరకూ ప్లాస్టిక్ భామల్ని అమ్ముతున్నారట. వివిధ కారణాలతో.. పలువురు ప్లాస్టిక్ భామల పొందుతో కాలం గడుపుతున్నారట. రోజులు గడిచే కొద్దీ ఇలాంటివి మరెన్ని మనిషి జీవితంలోకి వస్తాయో..?