Begin typing your search above and press return to search.

బిపిన్ రావత్ వీరమరణంపై చైనా మీడియా కారుకూతలు

By:  Tupaki Desk   |   10 Dec 2021 12:37 PM GMT
బిపిన్ రావత్ వీరమరణంపై చైనా మీడియా కారుకూతలు
X
కుక్కతోక వంకర లాగా.. ఇప్పుడు చైనా తీరు కూడా కనిపిస్తోంది. భారత త్రివిధ దళాధిపతి మరణంపై కూడా కారుకూతలు కూస్తోంది. అక్కడి మీడియా మరీ శవ రాజకీయాలు చేస్తోంది. తక్కువ చేసి మాట్లాడుతోంది. వీరుల మరణాన్ని ఎద్దేవా చేస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా అందరూ అసహ్యించుకుంటున్నా చైనా బుద్ది మాత్రం మారడం లేదు. ఎలాగైనా సరే పక్క దేశాలను ఇబ్బందులు పెడుతోంది. భారతదేశపు తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ వీరమరణంపై కూడా చైనా మీడియా కారు కూతలు కూస్తోంది. భారత త్రిదళాధిపతిపై అక్కసు వెళ్లగక్కుతోంది. దురదృష్టకర, విషాదకరమైన ఘటనపై ఇష్టమొచ్చినట్టు అవాకులు , చెవాకులు పేల్చుతోంది.

నీచ రాజకీయాలు చేసేందుకు అక్కడి మీడియా పిచ్చి రాతలకు తెరలేపింది. బిపిన్ రావత్ మరణం భారతదేశం క్రమశిక్షణ, పోరాట సంసిద్దతను బహిర్గతం చేసిందని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. బిపిన్ రావత్ మరణం వెనుక ఇండియా రక్షణపరమైన చర్యల లేమి ఉందంటూ ఎద్దేవా చేస్తోంది.

బిపిన్ రావత్ అంటే చైనాకు వణుకు. యుద్ధతంత్రం తెలిసినవాడు. వెన్నువిరవని ధీశాలి. ఆధునిక యుద్ధ వ్యూహాలను అవపోసన పట్టిన అపర సుభాష్ చంద్రబోస్ గా పేరుంది. చైనా, పాకిస్తాన్ లాంటి దేశాల వెన్నులో వణుకు పుట్టించే యుద్ధ నేర్పరి. సైనిక దళాలకు ఆత్మస్థైర్యం నింపే యుద్ధ శిఖరంగా పేరొందింది. ఆధునిక సాయుధ సంపత్తిని సమకూర్చి భారత సైనిక వ్యవస్థను తీర్చిదిద్దిన మహోన్నత దళపతిగా చెప్పారు. బిపిన్ రావత్ ధైర్య సాహసాలే చైనాకు కంటగింపుగా మారాయి.

చైనా జీవాయుధాలు కూడా ప్రయోగిస్తుందని మొట్టమొదట ఆరోపించింది మన బిపిన్ రావత్ నే.. పిచ్చికూతలు కూయడంలో ముందుండే చైనా ఇప్పుడు అక్కడి మీడియాను ఉసిగొల్పుతోంది. వీరుల మరణాన్ని ఎద్దేవా చేస్తోంది. భారతశక్తికి వక్రభాష్యం చెబుతోంది.