Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో చైనీయుల కలకలం.. ఎంతవరకు నిజం?

By:  Tupaki Desk   |   17 April 2020 4:06 AM GMT
హైదరాబాద్ లో చైనీయుల కలకలం.. ఎంతవరకు నిజం?
X
టీవీ చానళ్లు చూస్తున్న వారంతా గురువారం సాయంత్రం ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. హైదరాబాద్ మహానగరంలో చైనీయుల కలకలం అంటూ బ్రేకింగ్ న్యూస్ వేయటం.. దానికి సంబంధించిన కొన్ని విజువల్స్ ను ప్రసారం చేయటంతో ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. ఎంత చైనీయులు అయితే మాత్రం హైదరాబాద్ రోడ్ల మీద కనిపిస్తే చాలు.. అదో బ్రేకింగ్ న్యూస్ అవుతుందా? అన్న సందేహం అక్కర్లేదు. కరోనా వేళ.. చైనా.. చైనీయులు అంటే చాలు ఉలిక్కిపడిపోవటమే కాదు భయాందోళనలకు గురయ్యే వారికి కొదవ లేదు.

ఇంతకీ హైదరాబాద్ రోడ్ల మీద చైనీయుల కలకలం వెనుక అసలేం జరిగిందన్నది చూస్తే.. చైనాకు చెందిన పలువురు హైదరాబాద్ మహానగరంలోని పలు కాలేజీల్లో చదువుతున్నారు. ఇలాంటి వారిలో ఒక యువతి.. యువకుడు ఆర్నెల్ల క్రితమే హైదరాబాద్ కు వచ్చారు. అదిభట్ల ప్రాంతంలో ఉంటున్నారు. లాక్ డౌన్ వేళ.. ఒక వాహనంలో వారిద్దరూ.. వారితో పాటు నాగాలాండ్ కు చెందిన మరో యువతి కలిసి వెళుతున్నారు.

లాక్ డౌన్ పరిమితుల నేపథ్యంలో రోడ్ల మీద పలు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో.. ఎర్రగడ్డ వద్దకు రాగానే పోలీసులు కారును ఆపి తనిఖీ నిర్వహించారు. అందులో చైనాకు చెందిన ఇద్దరు కారులో ప్రయాణిస్తున్నట్లుగా సమాచారం అందంటంతో చానళ్లు చెలరేగిపోయారు. అయితే.. తమ స్నేహితురాలైన నాగాలాండ్ అమ్మాయిని సనత్ నగర్ లోని లోథా అపార్ట్ మెంట్లో డ్రాప్ చేయటానికి వచ్చారే తప్పించి.. మరే కారణం లేదని తేలింది. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో వారిని క్వాంరటైన్ సెంటర్ కు తరలించారు.