Begin typing your search above and press return to search.

లాక్​డౌన్​ పేరుతో చైనా నాటకాలు.. ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిన డ్రాగన్​

By:  Tupaki Desk   |   28 Sep 2020 11:30 PM GMT
లాక్​డౌన్​ పేరుతో చైనా నాటకాలు..  ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిన డ్రాగన్​
X
లాక్​డౌన్​ పేరుతో చైనా డ్రామాలు ఆడిందా! ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించి తాను మాత్రం సేఫ్​ అయ్యిందా! ప్రపంచంపై ఆధిపత్యం కోసమే ఇలాంటి కుయుక్తులు పన్నిందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. కరోనాను కట్టడి చేయాలంటే లాక్​డౌన్​ ఒక్కటే శరణ్యమని.. తాము కూడా కఠినంగా లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నామంటూ ప్రపంచాన్ని చైనా తప్పుదోవ పట్టించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా వైరస్ మొదట చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన విషయం తెలిసిందే. అక్కడ కరోనా కట్టడికి చైనా.. వుహాన్​ను షట్​డౌన్​ చేసింది. అందరినీ ఇళ్లకే పరిమితం చేసింది. ఈ విషయంలో చైనా వైఖరిని అమెరికాకు చెందిన ప్రముఖ లాయర్​ మైఖెల్​ సెంగర్​ తప్పు పట్టారు. ప్రపంచదేశాలను ఆర్థికంగా బలహీనపరిచేందుకు చైనా లాక్​డౌన్​ అస్త్రాన్ని ప్రయోగించిందని.. ప్రపంచదేశాలన్నీ చైనా ట్రాప్​లో పడిపోయాయని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. కరోనా వైరస్​ అంటేనే భయం కలిగించేలా చైనా సోషల్​మీడియాలో దుష్ప్రచారం మొదలుపెట్టిందని చెప్పారు.

బ్రిటన్​ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా కట్టడిలో హార్డ్ ఇమ్యూనిటీకే ప్రాధాన్యమిచ్చారు. కానీ ఆ తర్వాత డ్రాగన్​ ఇచ్చిన తప్పుడు సమాచారంతో బ్రిటన్​ను లాక్​డౌన్​ చేశాడు. ఇదంతా చైనా కుట్రే అని సెంగర్ ఆరోపించారు. ఇటీవల టాబ్లెట్​ అనే మ్యాగజైన్​లో ‘చైనా గ్లోబల్ లాక్​డౌన్​ ప్రాపగండా క్యాంపైన్’ అనే పేరుతో ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంలో మైఖేల్​ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. చైనా కరోనాపై తప్పడు ప్రచారం చేసేందుకు ట్విట్టర్​ను వేదికగా చేసుకున్నదని.. గత జూన్​లో ట్విట్టర్​ దాదాపు 23,750 ట్విట్టర్ అకౌంట్లలో కరోనాపై తప్పుడు సమాచారాన్ని గుర్తించినట్టు ట్విట్టర్ ధ్రువీకరించింది. ఆయా ఫేక్​ అకౌంట్లను ట్విట్టర్​ తొలగించింది. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టరే అంగీకరించింది. దీని ఆధారంగా చైనా వాళ్లు కావాలనే కరోనాను ఓ భూతంలా చూపారని ఆరోపణలు చేస్తున్నారు.