Begin typing your search above and press return to search.
పాకిస్తాన్ పర్యటక దేశం ఏంది స్వామీ?
By: Tupaki Desk | 20 April 2015 10:27 AM GMTఈ ప్రపంచంలో మనుషులు అనే వారు ఎవరైనా అస్సలు వెళ్లవద్దు అనుకునే దేశం ఏదైనా ఉందా అంటే అది పాకిస్తాన్ ఒక్కటే. ప్రపంచంలోని చిన్న దేశాలు సైతం అందర్నీ కలుపుకొని ఉండాలంటూ, టూరిజం ఆధారిత అభివృద్ధి సాధించాలని, తమదేశానికి ఇతర దేశాల ప్రజలు రావాలని కోరుకుంటారు. కానీ ఒక్క పాకిస్తాన్ మాత్రమే...మాకు నచ్చినట్లు మేముంటాం మిగతా వారితో మాకేం పని అన్నట్లు ఉంటుంది. ఇందుకు నిదర్శనం పొరుగున ఉన్న భారతదేశంతో ఎప్పటికీ గొడవలు, ఉగ్రవాదాన్ని పెంచిపోషించి భారత్ ను నష్టపరిచే చర్యలు. ఆఖరికి
అలాంటి పాకిస్తాన్ దేశాన్ని కీర్తిస్తున్నారు ఓ దేశాధ్యక్షుడు. ఆయనేదో అల్లా టప్పా దేశాధ్యక్షుడు అయిన పోనిలే అన్నట్లుగా ఉండేది. అదేమీ కాదు. సాక్షాత్తు చైనా అనే పెద్ద, అభివృద్ధిలో దూసుకుపోతున్న జనచైనా అధినేత.
చైనా అధ్యక్షుడు జీ జింగ్ పింగ్ పాక్ లో తన మొదటి పర్యటనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ వస్తే సోదరుడి ఇంటికి వెళ్లినట్లు ఉంటుందన్నారు. చైనా-పాకిస్తాన్ ల మధ్య సంబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఇరు దేశాల ప్రజల కలలను సాకారం చేసేందుకు, అభివృద్ధి గమ్యాలను సాధించేందుకు ముందుకువెళతానని చెప్పారు. చైనా- పాకిస్తాన్ కమ్యూనిటీ అందరికీ గమ్యం అయ్యేలాగా నిర్మిస్తామని అన్నారు.
చైనా-పాకిస్తాన్ ప్రజల కలలు అంటే ఏంటో చైనా అధ్యక్షుల వారు సెలవివ్వాలి. ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన పాకిస్తాన్్లో పర్యటనే వింత అంటే సదరు అధ్యక్షుల వారి మాటలు మరింత వింత.