Begin typing your search above and press return to search.

క‌రోనా ఎఫెక్ట్.. ఆర్థికం అత‌లాకుత‌లం.. చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్ రాజీనామా?!

By:  Tupaki Desk   |   15 May 2022 4:30 AM GMT
క‌రోనా ఎఫెక్ట్.. ఆర్థికం అత‌లాకుత‌లం.. చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్ రాజీనామా?!
X
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తన పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. కరోనా కట్టడిలో విఫలం కావడమే గాక, ఆర్థికవ్యవస్థ పతనానికి జిన్పింగ్ తప్పుడు నిర్ణయాలే కారణమని చైనా కమ్యూనిస్టు పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పదవి నుంచి తప్పుకోబోతున్నారని అక్కడి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కరోనా నిర్వహణలో పూర్తిగా విఫలం కావడమే కాకుండా, చైనా ఆర్థిక వ్యవస్థ పడిపోవడానికి జిన్పింగ్ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని, అందుకే ఆయనను చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) పక్కకు పెట్టబోతోందని తెలుస్తోంది. సీపీసీ పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ సమావేశం అనంతరం ఈ ప్రచారం మొదలైంది. చైనా పాలనలో ఈ నాయకత్వ బృందమే అత్యంత కీలకం.

ఈ సమావేశం అనంతరం కెనడాకు చెందిన బ్లాగర్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. చైనా కమ్యూనిస్టు పార్టీ.. కొద్ది నెలల్లో కీలక సమావేశాన్ని నిర్వహిస్తుందని, ఆ లోపే జిన్పింగ్ను పదివి నుంచి తప్పుకోవాలని ఆదేశించిందని చెప్పాడు. అంతేకాదు ప్రస్తుత ప్రీమియర్ లీ కెకియాంగ్ను తదుపరి చైనా అధ్యక్షుడిగా పార్టీ నియమిస్తుందని పేర్కొన్నాడు. పార్టీ నుంచి, పదవి నుంచి జిన్పింగ్ వైదొలుగుతారని వివరించాడు.

ప్ర‌జ‌ల్లోనూ తీవ్ర ఆగ్ర‌హం

కరోనా కట్టడి కోసం జీరో కొవిడ్ పాలసీ పేరుతో అత్యంత కఠిన ఆంక్షలు విధించారు జిన్పింగ్. దీనిపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అంతేగాక వ్యాపార సంస్థలపై కూడా ఆంక్షల వల్ల తీవ్ర ప్రభావం పడింది. దీంతో చైనా ఆర్థిక వ్యవస్థ పడిపోయింది. ప్రపంచ ఆర్థికవ్యవస్థ కూడా ప్రభావితమైంది. చైనా యువాన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో 4శాతం వరకు పడిపోయింది. గత 28ఏళ్లలో ఇంత కనిష్ఠానికి పడిపోవడం ఇదే తొలిసారి. కరోనా ఒక్క కారణం తప్ప ఆర్థిక వ్యవస్థ గురించి జిన్పింగ్ ఆలోచించలేదని, ప్రజలను ఇబ్బందిపెట్టడమే గాక ఆర్థిక వ్యవస్థ పడిపోవడానికి కారణమయ్యారని జిన్పింగ్పై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పదవి నుంచి వైదొలుగుతారని ప్రచారం జరుగుతోంది.