Begin typing your search above and press return to search.

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. చైనా అధ్యక్షుడు దేశం బయటకు..

By:  Tupaki Desk   |   27 Jun 2022 12:30 AM GMT
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. చైనా అధ్యక్షుడు దేశం బయటకు..
X
కరోనా వైరస్ ను పుట్టించి ప్రపంచానికి పాకించి వేడుక చూసిన చైనా అంటేనే ఇప్పుడు ప్రపంచ దేశాలు హడలిచస్తున్నాయి. కరోనాతో లక్షల మంది చనిపోయారు. ఎంతో మంది తమ ఆప్తులను కోల్పోయారు. ఈ వైరస్ చైనాలో వెలుగుచూసినప్పటి నుంచి ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్ పెంగ్ మరో దేశానికి వెళ్లలేదు. వైరస్ వ్యాప్తి కారక దేశం అన్న అపనింద ఓ వైపు.. ఆయన ఆరోగ్యం సరిగా లేక అసలు దేశం దాటలేకపోయారు.

దాడాపు 3 ఏళ్లుగా చైనా అధ్యక్షుడు షీజిన్ పింగ్ విదేశీ పర్యటనలు పెట్టుకోలేదు. తొలిసారి ఇన్నాళ్ల తర్వాత ఆయన చైనా దాటి బయటకు వస్తున్నారు. తాజాగా స్వతంత్ర ప్రాంతం హాంగ్ కాంగ్ లో చైనా అధ్యక్షుడు పర్యటిస్తున్నారు. హాంగ్ కాంగ్ 25 వార్షికోత్సవ వేడుకల్లో జిన్ పింగ్ స్వయంగా పాల్గొననున్నారు. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా స్వయంగా తెలిపింది.

హాంగ్ కాంగ్ లో పలు కార్యక్రమాల్లో జిన్ పింగ్ పాల్గొననున్నారు. అసలు చైనా పొడనే హాంగ్ కాంగ్ వాసులకు గిట్టడం లేదు. తమ ప్రాంతంలో చైనా వేలు పెట్టి ఆ దేశంలో కలుపుకోవాలనుకోవడాన్ని హాంగ్ కాంగ్ వాసులు వ్యతిరేకిస్తున్నారు. హాంగ్ కాంగ్ తమ ప్రాంతంలోనేదేనని చైనా వాదిస్తూ అక్కడ సైన్యాన్ని మోహరించి అణిచివేస్తోంది.

ఈ క్రమంలోనే హాంగ్ కాంగ్ పై పట్టు కోసం ప్రయత్నిస్తున్న చైనా జూలై1 తేదీ నుంచి హాంగ్ కాంగ్ కొత్త నాయకుడిగా జాన్ లీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో జిన్ పింగ్ పాల్గొంటారని ఆ వార్త సంస్థ పేర్కొంది.

హాంగ్ కాంగ్ 25వ స్వాధీన దినోత్సవ వేడుకలు కావడంతో దీనికి చాలా ప్రాధాన్యముంది. 2019లో ఇక్క చెలరేగిన ప్రజాస్వామ్య మద్దతు ఉద్యమాన్ని అణచివేసి ఎన్నికలు సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత తొలిసారి ఏర్పడ్డ ప్రభుత్వ ప్రమాణ వేడుక కూడా ఉండడంతో మరింత ప్రతిష్టాత్మకంగా మారింది.