Begin typing your search above and press return to search.
విశాఖ తీరంలో చైనా షిప్ ... కరోనా భయంతో ఆపేసిన అధికారులు !
By: Tupaki Desk | 6 March 2020 7:45 AM GMTవిశాఖ తీరంలో ఒక్కసారిగా కరోనా కలకలం రేపుతోంది. కరోనా వైరస్ పుట్టిన గడ్డ చైనా దేశం నుంచి ఏపీలోని విశాఖపట్నం సముద్ర తీరానికి ఫార్చూన్ హీరో షిప్ రావటంతో అధికారులు కలవరం చెందారు. చైనాలో కరోనా సృష్టిస్తున్న అలజడికి జడిసి విశాఖ అధికారులు ఆ ఫార్చూన్ హీరో షిప్ పోర్ట్‌కి రావడానికి అధికారులు అనుమతి నిరాకరించారు.పారాదీప్ పోర్టు అనుమతి నిరాకరించడం తో విశాఖకు వచ్చిన ఈ షిప్‌లో 22 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 15 మంది చైనీయులు, ముగ్గురు మయన్మార్ వాసులు ఉన్నారు. వీరికి కరోనా సోకిందన్న అనుమానంతో తీరానికి రావొద్దని ఆంక్షలు విధించారు.
నావికుల ఆరోగ్యపరిస్థితిపై అధికారులు ఆరా తీస్తున్నారు. శుక్రవారం వీరికి వైద్యపరీక్షలు చేసే అవకాశం ఉంది. ఏదేమైనా సరే ముందు జాగ్రత్తగా ఈ షిప్‌ను వెనక్కు తిప్పి పంపాలనే పోర్ట్ వర్గాలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. చైనా నుంచి వచ్చిన షిప్ అంటే మరింత కంగారు ఉంటుంది. పైగా షిప్‌లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిపైనా స్పష్టత లేకపోవడంతో పోర్ట్‌కి రావడానికి అనుమతివ్వలేదు. కరోనా పేరెత్తితేనే ఏపీ, తెలంగాణల్లో బెంబేలెత్తిపోతున్నారు. అలాంటిది ఏకంగా చైనా నుంచి వచ్చిన షిప్ అంటే సహజంగానే మరింత కంగారు ఉంటుంది. పైగా షిప్‌లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితి పైనా స్పష్టత లేక పోవడంతో పోర్ట్‌కి రావడానికి అనుమతివ్వలేదు.
ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. చైనాలో ఇప్పటికే 3వేలకు పైగా మృతి చెందినట్లు అధికారికంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో 139 మంది వైరస్ బారిన పడినట్లు ధ్రువీకరించారు. అయితే చైనాలో కరోనా క్రమక్రమంగా తగ్గుతున్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం గా ఈ వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య 3 వేలు దాటింది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది హుబే ప్రాంతానికి చెందిన వారని అధికారులు తెలిపారు.