Begin typing your search above and press return to search.

డేంజ‌ర్లో.. టోక్యో.. న్యూయార్క్‌.. బీజింగ్‌?

By:  Tupaki Desk   |   11 Nov 2017 11:00 AM GMT
డేంజ‌ర్లో.. టోక్యో.. న్యూయార్క్‌.. బీజింగ్‌?
X
మూడు ప్ర‌ముఖ మ‌హాన‌గ‌రాలు ముప్పులో పొంచి ఉన్నాయా? అంటే అవున‌ని చెబుతున్నారు. ఆసియా ఖండానికి చెందిన జపాన్ రాజ‌ధాని టోక్యో.. చైనా రాజ‌ధాని బీజింగ్ ల ప‌రిస్థితి ప్ర‌మాదంలో ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఈ రెండు మ‌హాన‌గ‌రాల‌తో పాటు అమెరికా ఆర్థిక రాజ‌ధానిగా చెప్పే న్యూయార్క్ కూడా డేంజ‌ర్ లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నుంచి మార్చిలోపు అనూహ్య ప‌రిణామం చోటు చేసుకోవ‌చ్చ‌న్న అంచాన వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇంత‌కీ ఆ అపాయం ఎందుకు? అస‌లేమైంద‌న్న విష‌య‌లోకి వెళితే.. యూరోపియ‌న్ స్పేస్ స్టేష‌న్లో ప‌రిధిలోని 8.5 ట‌న్నుల బ‌రువున్న స్పేస్ స్టేష‌న్‌ తో త‌మ‌కు సంబంధాలు పూర్తిగా తెగిపోయిన‌ట్లుగా చెబుతున్నారు. ప్ర‌స్తుతం అంత‌రిక్షంలో ఉన్న ఈ స్పేస్ స్టేష‌న్‌.. భూవాతావ‌ర‌ణంలోకి వ‌చ్చి కూలిపోతుంద‌ని చెబుతున్నారు.

అదుపు త‌ప్పిన స్పేస్ స్టేష‌న్ ఎక్క‌డ ఉంద‌న్న విష‌యంపై ఇప్ప‌టివ‌ర‌కూ అంతు చిక్క‌టం లేదు. నిపుణుల అంచ‌నా మేర‌కు ఈ మూడు న‌గ‌రాల‌తో పాటు లాస్ ఏంజెల్స్‌.. ఇస్తాంబుల్‌.. రోమ్ న‌గ‌రాల‌కు కూడా ప్ర‌మాదం పొంచి ఉంద‌ని చెబుతున్నారు. ఈ స్పేస్ స్టేష‌న్ భూ వాతావ‌ర‌ణంలోకి వ‌చ్చిన రెండు గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఎక్క‌డ కూలుతుంద‌న్న విష‌యాన్ని చెప్పే వీలుంద‌ని చెబుతున్నారు. ఈ స‌మాచారం ఇప్పుడు సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. ఆయా న‌గ‌రాల పౌరుల్లో కొత్త భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి.