Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ : తెలుగు రాష్ట్రాలకి పయనమైన చైనా స్టూడెంట్స్!

By:  Tupaki Desk   |   18 Feb 2020 11:30 AM GMT
కరోనా ఎఫెక్ట్ : తెలుగు రాష్ట్రాలకి పయనమైన చైనా స్టూడెంట్స్!
X
కరోనా వైరస్ ( కోవిడ్ -19 )....ప్రస్తుతం చైనా తో పాటుగా ప్రపంచం దేశాలని వణికిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ కోవిడ్ 19 వైరస్ తో సుమారుగా 1500 మందికి పైగా మరణించారు. లక్షలాది మంది ఈ వైరస్ ప్రభావంతో భాదపడుతున్నారు. చైనా లో ఉన్న తెలుగు స్టూడెంట్స్ కొద్దిసేపటి క్రితం తెలుగు రాష్ట్రాలకు బయలుదేరారు. చైనా లోని వూహన్ లో కోవిడ్ ప్రభావంతో .. కొద్దిరోజుల పాటు ఎయిర్‌ పోర్టులో ఉన్న మన దేశానికీ చెందిన వారిని మన ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోని ప్రత్యేక విమానాలని పంపి వూహన్ నుండి ఢిల్లీకి తీసుకొచ్చారు. వారిలో మన తెలుగురాష్ట్రాలకు చెందిన 23 మంది విద్యార్థులు కూడా ఉన్నారు.

అయితే, చైనా నుండి ఢిల్లీకి చేరుకున్న తెలుగు విద్యార్థులు గత పదిహేను రోజులుగా ప్రత్యేక హాస్పిటల్లో ఆబ్జర్వేషన్ వున్నారు. తాజాగా వారందరికీ కరోనా వైరస్ నెగెటివ్ రావడంతో వారిని తెలుగు రాష్ట్రాల్లోని వారి వారి సొంత ప్రాంతాలకు పంపించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాలకు బయలు దేరారు చైనా విద్యార్థులు. వూహన్ నగరం నుంచి వచ్చిన విద్యార్థులను కరోనా అనుమానంతో 15 రోజుల పాటు ఐసోలేషన్‌ లో ఆబ్జర్వేషన్ ఉంచారు. 15 రోజుల అబ్జర్వేషన్ అనంతరం వారిని స్వస్థలాలకు వెళ్ళడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనితో మంగళవారం మధ్యాహ్నం వారంతా స్వస్థలాలకు బయలుదేరారు. వీరిలో ఎవరికీ కోవిడ్-19 లేదని ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ.. వీరి పట్ల ఎలాంటి వివక్ష చూపరాదని ఆదేశాలుజారీ చేసింది. ఢిల్లీ నుంచి విశాఖ, హైదరాబాద్, విజయవాడకు విమానాల్లో బయలు దేరిన 23 మంది తెలుగువిద్యార్థులు మరికొద్దిసేపట్లోనే వారి వారి స్వస్థలాలకు చేరుకుంటారని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ అధికారులు తెలిపారు.