Begin typing your search above and press return to search.
సర్కారుకు పరీక్ష పెడుతోన్న బిచ్చగత్తె!
By: Tupaki Desk | 4 Nov 2018 6:00 AM GMTరోడ్డు మీదా.. ఆధ్యాత్మిక కేంద్రాలు.. ఇలా ఒకటేమిటి? జనసమ్మర్దం ఎక్కువగా ఉండే ప్రాంతం ఏదైనా సరే.. యాచకులు కనిపిస్తూ ఉంటారు. చేయి చాచి సాయం కోసం ఆర్థిస్తుంటారు. ఇలాంటి వారిని కంట్రోల్ చేసేందుకు కొన్ని ప్రభుత్వ వ్యవస్థలు పని చేస్తుంటాయి. అయితే.. ఒక యాచకురాలి కోసం అధికారులు మైకులు పట్టుకొని మరీ.. దయచేసి ఆమెకు డబ్బులు ఇవ్వొద్దంటూ ప్రచారం చేస్తున్నా ఫలితం లేని విచిత్ర ఉదంతం వింటే అవాక్కు అవ్వాల్సిందే.
ఇంతకీ ఒక భిక్షగత్తెకు డబ్బులు ఇవ్వొద్దంటూ అధికారులు ప్రచారం చేసే విచిత్రమైన పరిస్థితి ఎక్కడ నెలకొంది? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే అవాక్కు అయ్యే సమాచారం బయటకు వస్తుంది. ఇంతకీ.. ఈ యాచకురాలిది చైనా. చూసినంతనే అయ్యో పాపం అనిపించేలా.. ఆమె మాట వింటే పర్సులో నుంచి ఎంతోకొంత ఇవ్వలేనట్లుగా ఉండే ఆమె నిజమైన యాచకురాలు కాదని.. ఆమెకు ఐదంతస్తుల విల్లాలో ఉంటుందని ప్రచారం చేస్తున్నారు చైనా అధికారులు.
చైనాలోని హాంగ్ జూ రైల్వే స్టేషన్లో అయితే ఈ 79 ఏళ్ల యాచకురాలి గురించి ఏకంగా అనౌన్స్ మెంట్లు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి పెన్షన్ వస్తుందని.. కొడుకు వ్యాపారాలు చేస్తుంటాడని.. సంపన్న మహిళ అయిన ఆమెకు ఎట్టి పరిస్థితుల్లో దానం చేయొద్దని ప్రచారం చేస్తున్నా.. ఆమెను చూసినంతనే అయ్యో పాపం అనుకొని సాయం చేస్తున్నారట.
ప్రభుత్వం ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నా.. ఆ ముసలావిడ మాత్రం రోజుకు 300 యువాన్లను సంపాదిస్తున్నట్లుగా చెబుతున్నారు. వయసు మీద పడిపోతున్న కొద్దీ డబ్బుల అవసరం ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతో తాను యాచకం చేస్తున్నట్లుగా ఆమె చెబుతారు. ప్రజల సొమ్మును ఇలా దోచుకుంటుందా? అని సోషల్ మీడియాలో ఒక వర్గం మండిపడుతుంటే.. ఇంట్లో వాళ్లు సరిగా చూడని కారణంగానే ఇలా అడుక్కుంటుందన్న జాలిని పలువురు ప్రదర్శిస్తున్నారట. ఏమైనా.. ప్రభుత్వ అధికారులు స్వయంగా రంగంలోకి దిగి ఆమెకు సాయం చేయొద్దని ప్రచారం చేస్తున్నా.. ఆమె మాత్రం రోజుకు 300 యువాన్లు కూడబెడుతున్న వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.