Begin typing your search above and press return to search.
మన హద్దుల్లోకి వచ్చి జవాన్లను రెచ్చగొట్టిన చైనా
By: Tupaki Desk | 26 Jun 2017 4:31 PM GMTఅమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి అక్కడ బ్రహ్మరథం పడుతున్నారనే అక్కసు కావచ్చు - సహజసిద్ధమైన దుర్భుద్ధి అయి ఉండవచ్చు...కారణం ఏమైనా కానీయండి పొరుగు దేశమైన చైనా మరోమారు బరితెగింపునకు దిగింది. సిక్కిం సెక్టార్ లోని భారత భూభాగంలోకి చైనా బలగాలు చొచ్చుకువచ్చాయి. సిక్కిం-భూటాన్ సరిహద్దులోని ‘డోకా లా’ ప్రాంతంలో మన సైనికులను రెచ్చగొట్టిన చైనా బలగాలకు తగిన రీతిలో స్పందిస్తూ మన జవాన్లు సైతం వారిని అవతలి వైపు తోస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అయింది.
ఇటీవలి కాలంలో చైనా సైనికులు మన భూభాగంలోకి చొచ్చుకురావడం, మన పౌరులు - జవాన్ల పట్ల దురుసుగా ప్రవర్తించడం పరిపాటి అయింది. కైలాస మానస సరోవర యాత్రకు బయలుదేరిన భారత యాత్రీకుల బృందాన్ని ఇటీవల భూటాన్ సరిహద్దుల్లో అడ్డుకొని చైనా తన బరితెగింపును చాటుకుంది. ఈ పరిణామంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు సిక్కింలోని డొకాలా ప్రాంతంలో మన దేశం పునర్ నిర్మించిన ఓ చెక్ పోస్టును , బంకర్ ను చైనీస్ ఆర్మీ ధ్వంసం చేసినట్లు కొద్దికాలం క్రితం వీడియో బయటకు వచ్చింది. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో తమ చర్యను తప్పుపట్టడం, ప్రతిఘటించిన తీరును మనసులో పెట్టుకున్న చైనా మరోమారు రెచ్చగొట్టే చర్యకు దిగినట్లు విశ్లేషిస్తున్నారు. భారత బలగాలను రెచ్చగొడుతూ, ఉద్దేశపూర్వకంగా సరిహద్దు దాటి మన పరిధిలోకి చైనా సైనికులు రావడం ఆ దేశం మనపట్ల అనుసరిస్తున్న వైఖరికి నిదర్శనమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. స్వత్రంత్య దేశంగా ఉన్న టిబెట్ సౌర్వభౌమాధికారాన్ని అంగీకరించని చైనా అక్కడ భూభాగాలను స్వాధీనం చేసుకొని భారత్‌ను ఇబ్బందులు పాలు చేస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/