Begin typing your search above and press return to search.

జైలు భయంతో 13సార్లు ప్రెగ్నెంట్

By:  Tupaki Desk   |   14 Aug 2015 4:31 PM GMT
జైలు భయంతో 13సార్లు ప్రెగ్నెంట్
X
తప్పు చేసేటప్పుడు రాని భయం.. తప్పు కాస్త బయటపడిపోయి.. కోర్టు చేతిలో జైలుశిక్ష పడిన ఒక మహిళ.. జైలుశిక్షను తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చైనాకు చెందిన ఒక యువతి.. కోర్టు విధించిన జైలుశిక్ష నుంచి తప్పించుకునేందుకు భారీ ప్రయత్నమే చేసింది.

అవినీతికి పాల్పడిన జెంగ్ అనే చైనా మహిళ దొరికిపోయింది. దీంతో ఆమెను కోర్టులోహాజరు పర్చటం.. ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధించటం జరిగిపోయాయి. యావజ్జీవ శిక్ష నుంచి తప్పించుకోవటానికి ఏదైనా షార్ట్ కట్ ఉందా అన్న కోణంలో ఆలోచించిన ఆమె క్రిమినల్ బ్రెయిన్ కు గర్భవతి అయిన మహిళకు జైలు శిక్ష పడకుండా మినహాయింపు ఇస్తారని తెలుసుకుంది.

అంతే.. జైలుశిక్షకు రెఢీ అయ్యే ప్రతిసారి ఆమె తాను ప్రెగ్నెంట్ అని పేర్కొనేది. 2005లో అవినీతి నేరానికి అరెస్ట్ అయిన ఆమె.. అదే ఏడాది యావజ్జీవ శిక్షను కోర్టు విధించింది. అయితే.. విచారణ సందర్భంగా ఆమె తాను ప్రెగ్నెంట్ అని కోర్టుకు చెప్పింది. దీంతో.. శిక్ష అమలుకు కోర్టు మినహాయింపు ఇచ్చింది. దాన్ని అదునుగా తీసుకొని 13సార్లు తాను గర్భవతినని చెప్పటం.. ఆమె మాటలు నమ్మక టెస్ట్ లు చేయిస్తే.. ఆమె ప్రెగ్నెంట్ అని తేలింది. నిజానికి తాను గర్భవతినని 14 సార్లు చెబితే.. అందులో 13సార్లు నిజమని తేలింది. అలా జైలు శిక్ష తప్పించుకున్న ఆమె చివరకు జైలుపాలు కాక తప్పలేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 13సార్లు గర్భవతి అయినప్పటికీ..ఆమె మాత్రం ఒక్కరి కూడా జన్మనివ్వలేదు. గర్భవతి కావటం..ఆ విషయాన్ని కోర్టుకు తెలపటం.. జైలుశిక్ష నుంచి మినహాయింపు పొంది.. మళ్లీ గర్భవతి అయ్యే ప్రయత్నాలు చేసేదని తేల్చారు. ప్రస్తుతం 39 ఏళ్ల జెంగ్ జైలు శిక్ష అనుభవిస్తోంది.