Begin typing your search above and press return to search.

ఆ కవల పిల్లల తండ్రి వేరు.. అసలు మ్యాటర్‌ ఇది

By:  Tupaki Desk   |   30 March 2019 1:30 AM GMT
ఆ కవల పిల్లల తండ్రి వేరు.. అసలు మ్యాటర్‌ ఇది
X
ఒకే కాన్పులో జన్మించిన వారిని కవలలు అంటారనే విషయం తెల్సిందే. కవల పిల్లలకు తండ్రి ఒక్కడే ఉంటాడనే విషయం కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే చైనాలో మాత్రం తాజాగా ఒక వింత సంఘటన జరిగింది. కొన్ని వారాల క్రితం ఒక మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చింది. అయితే వారి పోలికలు వేరు వేరుగా ఉండటంతో తండ్రికి అనుమానం వచ్చింది. భార్యపై అనుమానంతో పేటర్నిటీ టెస్టులు చేయించాడు. ఆ టెస్టుల్లో కవల పిల్లలు ఇద్దరు కూడా వేరు వేరు డీఎన్‌ఏ ను కలిగి ఉన్నట్లుగా షాకింగ్‌ రిపోర్ట్‌ వచ్చింది. దాంతో అతడి అనుమానం నిజం అయ్యింది. కవల పిల్లల్లో ఒకరితో మాత్రమే అతడి డీఎన్‌ఏ మ్యాచ్‌ అవ్వడంతో తన భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది, ఆ రెండవ బేబీ తన భార్య వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం వల్ల కలిగిన సంతానం అంటూ వాదించడం మొదలు పెట్టాడు.

మొదట తన భర్త వాదనలను బలంగా కొట్టి పారేస్తూ వచ్చిన ఆమె కాస్త లోతుగా విచారించడంతో అసలు విషయం బయట పడింది. గర్బం దాల్చక ముందు తాను ఒక వ్యక్తితో సంబంధం పెట్టుకున్నట్లుగా చెప్పుకొచ్చింది. దాంతో వైధ్యులు ఈ విచిత్రమైన సంఘటనను ఛేదించారు. భర్తతో శృంగారంలో పాల్గొన్న ఒకటి రెండు రోజుల తేడాతో మరో వ్యక్తితో శృంగారంలో పాల్గొనడం వల్ల ఇద్దరి స్పెర్మ్‌ తో ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చిందని వైధ్యులు చెబుతున్నారు. ప్రపంచంలో అత్యంత వింత సంఘటనగా వైధ్యులు సైతం దీన్ని పరిగణిస్తున్నారు. కవల పిల్లలు విభిన్నమైన డీఎన్‌ఏలతో జన్మించడం అనేది ఇప్పటి వరకు జరగలేదు అంటూ వారు చెబుతున్నారు. ఇదే ప్రథమం అయ్యి ఉంటుందని వారు అంటున్నారు.