Begin typing your search above and press return to search.
సుప్రీంకోర్డు జోక్యంతో బీజేపీ నేత అరెస్టు
By: Tupaki Desk | 20 Sep 2019 9:47 AM GMTభారత రాజ్యంగం కల్పించిన హక్కులను కల్పించాల్సినవారు పట్టించుకోకపోతే.. వారికి ఎవరు ? దిక్కు. రాజ్యాంగం ప్రకారం ప్రజాప్రతినిధిగా పనిచేస్తామని ప్రమాణాలు చేసి కూడా ఆ రాజ్యాంగ హక్కులు కాలరాస్తే వారికి ఎవరు దిక్కు.. హక్కులు రక్షణకు పెద్దదిక్కు కోర్టులే.. ఇప్పుడు రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న వారికి కోర్టులు మొట్టికాయలు వేస్తే తప్ప వాటిని రక్షించేవారు దిగొస్తున్నారు. సుప్రీంకోర్డు జోక్యంతో ఓ బాధితురాలికి న్యాయం జరిగిందనే చెప్పవచ్చు. యూపీకి చెందిన బీజేపీ నేత - కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్ (57) తాను నిర్వహించే మెడికల్ కాలేజ్ లో చదివిన వైద్య విద్యార్ధినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి.
అయితే ఈ వైద్య విద్యార్థిని బీజేపీ నేతపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో బాధితులురాలు సుప్రీంకోర్టు తలుపుతట్టింది. దీంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని బీజేపీ నేతను అరెస్టు చేయాలంటూ ఆదేశించడంతో ఇప్పుడు యూపీ పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ నేత - కేంద్రమాజీ మంత్రి స్వామి చిన్మయానంద్ యూపీలో పలు ఆశ్రమాలు - విద్యాసంస్ధలు నడుపుతున్నాడు. అయితే యూపీలో రాజకీయ ప్రాబల్యం కలిగిన చిన్మయానంద్ పై బాధితురాలు నెలరోజుల కిందటే ఫిర్యాదు చేసినా ఆయనపై చాలా రోజుల వరకూ లైంగిక దాడి కేసు నమోదు చేయలేదు.
సుప్రీం కోర్టు జోక్యంతో కేసులో కదలిక రాగా - సోమవారం భారీ భద్రత నడుమ బాధితురాలు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ర్టేట్ కోర్టులో స్టేట్ మెంట్ ఇచ్చిన క్రమంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాలేజీలో అడ్మిషన్ ఇచ్చేందుకు సాయపడిన చిన్మయానంద్ తనను ఏడాది పాటు లైంగికంగా వేధించాడని బాధిత విద్యార్థిని ఆరోపించింది. అయితే పోలీసుల రాజకీయ ప్రాబల్యం కగిలిన బీజేపీ నేత వైపు కన్నెత్తి చూడాలేదు. ఇదే కాలేజ్ హాస్టల్ లో వైద్య విద్యార్థిని స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డు చేసి చిన్మయానంద్ తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు.
స్వామి పాడుబుద్ధిని బయటపెట్టేందుకు ఆధారాల కోసం తన కళ్లద్దాల్లో కెమెరా అమర్చి రికార్డు చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. చిన్మయానంద్ పై పరోక్షంగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన అనంతరం ఆగస్ట్ 24 నుంచి ఆమె అదృశ్యమయ్యారు. వారం తర్వాత యూపీ పోలీసులు ఆమె ఆచూకీని కనుగొన్నారు. మరోవైపు బాధితురాలి ఆరోపణలను పరిశీలించిన సుప్రీం కోర్టు సిట్ విచారణకు ఆదేశించింది. బాధితురాలి హాస్టల్ గదిని పరిశీలించిన సిట్ బృందం గతవారం చిన్మయానంద్ ను ఏడు గంటల పాటు ప్రశ్నించింది. అనంతరం అతడిని పోలీసులు వదిలేశారు. దీంతో సుప్రీంకోర్టు జోక్యంతో అరెస్టు చేసింది బీజేపీ ప్రభుత్వం.