Begin typing your search above and press return to search.
ట్విట్టర్ వేదికగా అమ్మాయిల తల్లిదండ్రులను హెచ్చిరించి చిన్మయి..: వైరల్
By: Tupaki Desk | 6 Dec 2021 7:29 AM GMTటాలీవుడ్ గాయని చిన్మయి పాటల ద్వారానే కాకుండా సోషల్ మీడియాలోనూ పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆమె నిత్యం సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర పోస్టులు పెడూతూ అందరినీ ఆకట్టుకుంటారు. గతంలో క్యాస్టింగ్ కౌచ్ పేరిట జరిగిన సోషల్ మీడియా వార్లో చిన్మయి కూడా ఉన్నారు.
సినిమా రంగంలో ఆడవాళ్లపై జరిగిన అవమాన కర సంఘటనల గూర్చి తెలియజెప్పారు. తాజాగా ఆమె మరో సంచలన పోస్టు పెట్టారు. అమ్మాయిల విషయంలో కొందరు తల్లిదండ్రులు ఇలా ఎందుకు ఆలోచిస్తారో.. తెలియదు అంటూ ఓ పేజీలో కొంత మ్యాటర్ రాసి పోస్టు చేశారు. అయితే దీనిపై మిశ్రమంగా కామెంట్స్ వస్తున్నాయి. కొందరు ఆమె అభిప్రాయానికి మద్దతు పలుకుతుండగా మరికొందరు అదేం లేదంటూ కామెంట్స్ పెడుతున్నారు.
కట్నం విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో అభిప్రాయం. కొందరు ఆర్థికంగా బాగా లేకుండా ఆడపిల్ల పిల్లకు కట్నం ఇచ్చి అత్తారింటికి పంపుతారు. అయితే అమ్మాయిలకు స్వేచ్ఛగా ఖర్చుపెట్టే అవకాశం ఇవ్వని తల్లిదండ్రులు తమ స్థోమత లేకున్నా కట్నం ఇచ్చి ముక్కు, మోహం తెలియని వారి చేతిలో పెడుతారు అని చిన్మయి ఆందోళన చెందుతోంది. ఇప్పటికే అమ్మాయిలు, వారి పెళ్లిళ్ల గురించి సలహాలు ఇచ్చిన చిన్మయి తాజాగా మరో పోస్టు పెట్టింది. ఆ పోస్టు ఇలా ఉంది..
‘డ్రంకెన్ డ్రైవింగ్.. ఓవర్ స్పీడింగ్ గురించి ఓ అవగాహన ఉంది. ఇవి జరుగుతాయి.. ఇవిచేయాలి.. ఇవి చేయొద్దు అని చెబుతారు. అయితే అందరూ తాగి బండి నడుపుతారన కాదు.. అది ఎవరికి అవసరమో.. వారికి చెబుతారు. అయితే ఎన్ఆర్ఎస్ అందరూ అలా కాదు.. ఓ అమ్మాయి తన జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాల గురించి అందరికీ చెబుతున్నాను.
దీంతో మరో అమ్మాయి జాగ్రత్త పడుతుందని చెబుతున్నా.. నాకు ఈ ఫారిన్ సంబంధం గురించి ఎప్పటికీ అర్థం కాదు. కొందరు తల్లిదండ్రులు తమ బిడ్డకు గౌరవంగా బతికే ఛాన్స్, స్వేచ్ఛ అస్సలు ఇవ్వరు. కానీ కాట్నం ఇచ్చి మరీ పెళ్లి చేస్తారు.’ అని తెలిపింది.
‘అదే అమ్మాయిలను ఆర్థికంగా స్వతంత్రంగా బతకనివ్వరు. అలా చేస్తే తమ అమ్మాయి వేరే క్యాస్ట్ వాళ్లని పెళ్లి చేసుకుంటుందని భయం. ఫోర్స్ చేసీ ముక్కు, మోహం తెలియని వారికి కట్టబెడుతారు.. వాడు కొట్టినా,తిట్టినా వాడితోనే కాపురం చేయమని అంటారు.
అయితే అందరినీ జనరలైజ్ చేస్తున్నావ్.. కొందరు ఆడవాళ్లు నువ్వు చెప్పేదానిని అంగీకరించరు.. అని చెబుతున్న మనుషులకు ఈ పితృస్వామ్య వ్యవస్థను ఇంకా కొంతమంది మహిళలు సమర్తిస్తూనే ఉంటారు’ అని చిన్మయి తన పోస్టులో పేర్కొంది.