Begin typing your search above and press return to search.
యాభై ఏళ్ల టీచర్ తో ఆరో తరగతి పిల్లాడి వేధింపులపై చిన్మయి ఓపెన్
By: Tupaki Desk | 9 Aug 2021 1:09 AM GMTతన పాటతోనే కాదు.. గమ్మత్తు గొంతుతో అందరిని కట్టపడేసే గాయని ప్లస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి.. సామాజిక అంశాల్లో ఎంత చురుగ్గా ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మీటూ విషయంలోనూ ఆమె చేసిన వ్యాఖ్యలు.. తీసుకున్న నిర్ణయాలు.. చేసిన పోరాటాలు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తనకు ఎదురైన లైంగిక వేధింపుల్ని ఓపెన్ గా చెప్పటమే కాదు.. దానికి ప్రతిఫలంగా ఎదురైన ఒత్తిళ్లను ఎదుర్కొంటూ.. దీనిపై ఆమె చేస్తున్న పోరాటం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో ఆమెకు పలువురు శత్రువులు పెరిగినప్పటికి వెనకడుగు వేయని పరిస్థితి. మహిళల లైంగిక వేధింపులపై తన అభిప్రాయాల్ని వెల్లడిస్తూ.. ఆమె తరచూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తుంటారు చిన్మయి.
తాజాగా ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో సంచలన అంశాల్ని వెల్లడించారు. టీచర్లు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై ఆమె షాకింగ్ నిజాల్ని వెల్లడించారు. ఈ సందర్భంగా తనకు తెలిసిన ఒక ఉదంతాన్ని షేర్ చేయటం ద్వారా కొత్త చర్చకు తెర తీశారని చెప్పాలి. ఎనిమిదో తరగతి పిల్లలకు న్యూట్రీషియనిస్టుగా వ్యవహరించే టీచర్.. ఆమె క్లాస్ చెప్పటానికి వెళ్లినప్పుడు ఎదురైన అనుభవాల్ని వివరించారు.
అంతేకాదు.. ఆరో తరగతి చదివే పిల్లాడు టీచర్ ను ముద్దు పెట్టుకోవటాన్ని హీరోయిజంగా భావిస్తున్న వైనాన్ని తన ట్వీట్ తో పేర్కొని సంచలనంగా మారారు. ఇక.. కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ లో క్లాసులు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి టీచర్లకు కొత్త సమస్య అవుతుందని.. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అసభ్యకరమైన మెసేజ్లు వస్తున్నాయని పేర్కొన్నారు. చిన్మయి చేసిన ట్వీట్ తర్వాత టీచర్లు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై పలువురు స్పందించటమే కాదు.. కొందరు తమ అనుభవాల్ని షేర్ చేయటం గమనార్హం.
ఈ ట్వీట్లకు చిన్మయి రీ ట్వీట్లు చేస్తున్నారు. యాభై ఏళ్ల టీచర్లు కూడా ఈ తరహా వేధింపులు ఎదురుకావటం శోచనీయమని చిన్మయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ పిల్లలు మాత్రమే కాదు.. వారి తండ్రులు కూడా ఈ తరహా ఆలోచన ధోరణితో ఉండటం శోచనీయమన్న ఆమె మాటల్లో అర్థముంది. చిన్మయి చేసిన ట్వీట్ పుణ్యమా అని ఇప్పుడా అంశంపై ఆసక్తికరచర్చకు తెర తీసినట్లైందని చెప్పాలి.