Begin typing your search above and press return to search.
శబరిమలపై చట్టం మసీదుపై పని చేయదా?
By: Tupaki Desk | 19 Nov 2018 12:47 PM GMTగత కొన్ని రోజులుగా శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశం పై వివాదం అవుతున్న విషయం తెల్సిందే. సుప్రీం కోర్టు పది సంవత్సరాల వయస్సు నుంచి 50 సంవత్సరాల మహిళలకు ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ తీర్పుకు వ్యతిరేకిస్తు పలు సంస్దలు ఆందోళనలు చేపట్టాయి. ఈ తీర్పుపై చిన్నజీయర్ స్వామీ ఎట్టకేలకు స్పందించారు. ఆదివారం నాడు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆలయ నియమ నిబంధనలు ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆయన అన్నారు. హిందూ ఆలయమైన శబరిమల విషయంలో జోక్యం చేసుకుని తీర్పు చెప్పిన సుప్రీం కోర్టు - మసీదు విషయంలో ఇలాంటి తీర్పును ఇవ్వగలదా..? అని ప్రశ్నించారు. భారతదేశంలో అత్యున్నత న్యాయస్దానం తీర్పు ఆగమ శాస్త్రాలకు వ్యతిరేకంగా ఉందని - ఇది ఏమాత్రం మంచిది కాదని ఆయన అన్నారు. హిందు దేవాలయాలు - శాస్త్రాల విషయంలో రాజకీయ జోక్యం ఎక్కవైందని - ప్రతి ఆలయానికి కొన్ని నిబంధనలు ఉంటాయని - దేవుడిని నమ్మె వారంతా ఆ నియమాలను గౌరవించాలని ఆయన అన్నారు. రాజ్యంగం పరిధిలో మన శాస్త్రాలకు రాజ్యంగం కొన్ని హక్కులు కల్పించిదని - వాటిపై ఇతరుల పెత్తనం సాగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
శబరిమల ఆలయానికే కాదు ప్రతి ఆలయానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయని - ప్రజల మనోభావాలకు అనుగుణంగానే కోర్టులు కూడా తీర్పులు ఇవ్వాలని ఆయన అన్నారు. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ విషయంలో లేనిపోని రాద్దాంతం చేస్తున్నారని - ఈ విషయాలన్ని అనవసరంగా రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ప్రాణికి స్వేచ్చగా బ్రతికే హక్కు ఉందని - అయితే ఆ స్వేఛ్చ సమాజానికి ప్రమాదం లేకుండా చూసుకోవాలని అన్నారు.
శరీరంలో అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తేనే ఆ మనిషి ఆరోగ్యంగా ఉన్నట్లు. అలాగే సమాజంలో అందరూ కూడా, అందరినీ సమంగా చూడాలని - సమతాభావం అలవర్చుకోవాలని అన్నారు. మానవ దేహం ఇతరులను సమానంగా చూడగలిగితేనే మానవత్వం అవుతుందని - అప్పుడే ఈ మానవ దేహం అందరికీ ఆదర్శం అవుతుందని చిన్నజీయర్ స్వామి అన్నారు. త్వరలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరిట భగవాన్ రామానుజాచార్యుల 216 అడుగుల విగ్రహన్ని నెలకొల్పుతామని అన్నారు. ఈ కట్టడం 70 ఎకరాలు విస్తీర్ణంలోన ఉంటుందని అన్నారు. వచ్చే సంవత్సరానికి దీనిని పూర్తి చేస్తామని - ఈ విగ్రహన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరిస్తారని చెప్పారు.