Begin typing your search above and press return to search.
చినరాజప్ప లిఫ్ట్ ప్రమాదం అర్థరాత్రి జరిగిందా?
By: Tupaki Desk | 25 Oct 2016 5:17 AM GMTఏపీ హోంమంత్రి చినరాజప్పకు సంబంధించిన వార్త ఒకటి ఈ రోజు (మంగళవారం) ఉదయం 10 గంటలు దాటిన తర్వాత టీవీ ఛానళ్లలో ఒక్కసారిగా బ్రేకింగ్ న్యూస్ అయ్యింది. ఏపీ హోంమంత్రి చినరాజప్ప కాకినాడ ఆసుపత్రికి వెళ్లారని.. ఆయన ఎక్కిన లిఫ్ట్ వైరు ఒక్కసారిగా తెగిందని దీంతో.. ఆయన నడుముకు గాయాలైనట్లుగా బ్రేకింగ్ న్యూస్ లు వేసేసి హడావుడి పెట్టేశారు. అంత పెద్ద హోంమంత్రి ఎక్కిన లిఫ్ట్ ప్రమాదానికి గురైందన్న వార్త ఒక్కసారి అందరిని విస్మయానికి గురి చేసింది. అయ్యో.. అంత పని జరిగిందా? అనిపించేలా చేసింది.
హోంమంత్రి లాంటి వ్యక్తి ఎక్కిన లిఫ్ట్ ప్రమాదానికి గురికావటం.. ఆయన గాయాలు కావటంతో ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్ని సేకరించేందుకు ప్రయత్నించిన వేళ.. షాకింగ్ సమాచారం బయటకు వచ్చింది. అదేమిటంటే.. టీవీల్లో బ్రేకింగ్ వేసినట్లుగా చినరాజప్పకు మంగళవారం ఉదయం ప్రమాదం జరగలేదని.. సోమవారం అర్థరాత్రివేళే ఆయన ప్రమాదానికి గురయ్యారన్న విషయం బయటకు వచ్చింది.
అయినా.. అర్థరాత్రివేళ హోంమంత్రి కాకినాడ సంజీవిని ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందన్న విషయంలోకి వెళితే.. ఒక రొయ్యల పరిశ్రమలో గ్యాస్ విడుదలై.. దాదాపు పాతిక మంది (పోలీసులు మాత్రం ఇద్దరు.. ముగ్గురు మాత్రమేనని చెప్పటం గమనార్హం) వరకూ అస్వస్థతకు గురయ్యారని.. వారిలో ఒకరి ఆరోగ్యం ఏ మాత్రం బాగోలేదన్న సమాచారంతో బాధితుల్ని పరామర్శించేందుకు అంత రాత్రివేళ.. చినరాజప్ప ఆసుపత్రికి బయలుదేరారు.
ఆసుపత్రికి వెళ్లిన చినరాజప్ప.. బాధితుల్ని పరామర్శించి.. తిరిగి వస్తున్నసమయంలో ఆయన ప్రయాణిస్తున్న లిఫ్ట్ ప్రమాదానికి గురైంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. చీమ చిటుక్కుమన్నా.. ఒక్కసారిగా అలెర్ట్ అయ్యేలా ఉంటుందని చెప్పే మీడియా.. ఎప్పుడో అర్థరాత్రి జరిగిన ప్రమాదాన్ని పక్కరోజు ఉదయం 10 గంటలకు బ్రేకింగ్ న్యూస్ కింద వేయటం.. అసలుసిసలు షాకింగ్ న్యూస్ గా చెప్పాలి. ప్రమాదానికి గురైన వ్యక్తి సామాన్యుడైతే ఓకే. ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి ప్రమాదానికి గురైతే.. ఇంత ఆలస్యంగా బ్రేకింగ్ న్యూస్ వేయటం ఏమిటి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/