Begin typing your search above and press return to search.
ప్రశాంత్ కిశోర్ బచ్చా.. తిరుపతి మాజీ ఎంపీ.. చింతా మోహన్ సంచలన కామెంట్లు
By: Tupaki Desk | 30 Oct 2021 3:51 PM GMTఇటీవల కాంగ్రెస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రాజకీయ వ్యూహకర్త.. ప్రశాంత్ కిశోర్‌పై కాంగ్రెస్ నేతల దూకుడు కొనసాగుతోంది. రాహుల్‌గాంధీని తక్కువ చేసి మాట్లాడతారా? అంటూ.. ఇప్పటికే మహారాష్ట్ర సహా.. యూపీలోని కొందరు నేతలు.. పీకేపై నోరు చేసుకున్నారు. మోడీపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా.. ఆయనను పక్కన పెట్టేందుకు ప్రజలు సిద్ధంగానే ఉన్నా.. రాహుల్ పుంజుకునే పరిస్థితి లేదని పీకే వ్యాఖ్యానించారు. దీనిపై తాజాగా.. తిరుపతి మాజీ ఎంపీ.. కేంద్ర మాజీ మంత్రి.. చింతా మోహన్ పైరయ్యారు. `` ప్రశాంత కిశోర్ ఓ బచ్చా`` అంటూ విరుచుకుపడ్డారు.
ప్రశాంత్ కిశోర్ కాదు... వారి నాన్న, తాత వచ్చినా కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరని మోహన్ అన్నారు. కాంగ్రెస్ గురించి ప్రశాంత్ కిశోర్‌కు ఏం తెలుసని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ బలహీనపడటానికి కారణం ఇద్దరు నాయకులన్నారు. వారిలో ఒకరు పీవీ నరసింహారావన్నారు. అయోధ్య ఘటనతోనే మైనార్టీలు కాంగ్రె్‌సకు దూరమయ్యారన్నా రు. రాష్ట్ర విభజనకు కారణం వైఎస్ రాజశేఖర్‌రెడ్డన్నారు. చెన్నారెడ్డిని దించేందుకు ఒక నాయకుడు పాత బస్తీలో మారణహోమం సృష్టించారన్నా రు. వందలాది మందికి కాళ్లు, చేతులు తీసేశారన్నారు. ఆ నాయకుడు ఇ ప్పుడు లేడని, చనిపోయాడన్నారు.
``మిస్టర్ జగన్మోహనరెడ్డి మీ నాన్న ఆరు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. నీవూ ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఇకచాలు... తప్పుకోండ``ని జగనకు సూచించారు. నిత్యావసర, ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో రెండు సా మాజికవర్గాలే పాలన సాగిస్తున్నారన్నారు. ఆరు శాతం ఉన్న ఆ వర్గాలు రాష్ర్టాన్ని దోచుకుంటున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో బలిజల ఆర్థిక పరిస్థితి బాగోలేదన్నారు. ఇప్పటి వరకూ ఆ సామాజికవర్గం నుంచి ముఖ్యమంత్రిగా ఎవరూ ఎన్నిక కాలేదన్నారు.
2024లో బలిజ, కాపు సామాజికవర్గం నుంచి ముఖ్యమంత్రి అవుతారన్నారు. ఈ విషయం తాను వ్యక్తిగతంగా చెబుతున్నాన న్నారు. ఆ సామాజికవర్గంలో సమర్థవంతమైన నాయకుడి కోసం వెతుకుతున్నానన్నారు. మొత్తానికి చింతా మోహన్ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టించనున్నాయని అంటున్నారు పరిశీలకులు.