Begin typing your search above and press return to search.
ఎన్నికలపైనా.. ఎన్నికల కమిషనర్‌పైనా చింతా మోహన్ ఫైర్.. ఏమన్నారంటే!!
By: Tupaki Desk | 16 March 2021 1:30 AM GMTఏపీలో తాజాగా జరిగిన మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై మాజీ ఎంపీ.. చింతా మోహన్.. తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన రాజకీయ జీవితంలో ప్రత్యర్థులను ఈ రేంజ్‌లో భయపెట్టి, బెదిరించి, అక్రమ కేసులతో వేధించి.. సాధించుకున్న ఎన్నికలను చూడలేదని.. వీటినే చూస్తున్నానని ఆయన అన్నారు. అదేసమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైనా.. ఆయన తీవ్రస్తాయిలో విమర్శలు గుప్పించారు. ఆదిలో గట్టి పట్టుతో ఉన్న నిమ్మగడ్డ.. రానురాను.. చేతులు ఎత్తేశారని అన్నారు. నిమ్మగడ్డ.. ఐస్‌గడ్డలా కరిగిపోయారని ఎద్దేవా చేశారు.
1952 నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ఎన్నికలను చూడలేదని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను భ్రాయభ్రాంతులకు గురిచేశారని మండిపడ్డారు. కర్ణాటక, తెలంగాణ నుంచి మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారంటూ.. కేసులు పెడతామని.. ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థులను తీవ్రస్థాయిలో బెదిరించారని.. ముఖ్యంగా చిత్తూరులో ఎర్రచందనం అక్రమ కేసులు పెడతామని పోటీదారులను భయబ్రాంతులకు గురి చేశారని చింతా ఆరోపించారు. చాలా చోట్ల భయపెట్టి ఏకగ్రీవాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పురపాలక, నగర పాలక సంస్థ ఎన్నికలు ఫేక్ ఎన్నికలని చింతామోహన్ చెప్పారు.
మరోవైపు.. ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టే వ్యక్తి.. రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌లు కాకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం శుభ పరిణామమని చింతా మోహన్ చెప్పడం గమనార్హం. ఇక, ఇదే సమయంలో తిరుపతి పార్లమెంటు స్థానానికి త్వరలోనే జరగనున్న ఉప ఎన్నికకు సంబంధించి కూడా చింతా మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ.. తిరుమల తిరుపతి దేవస్తానం.. రూ.300 కోట్లతో చిన్న పిల్లల ఆస్పత్రి నిర్మాణం చేస్తామని, ఎన్నికలకు ముందు ఓ సంస్థతో ఒప్పందం చేసుకోవడం.. రాజకీయ జిమ్మిక్కుగా అబివర్ణించారు. రూ.300 లేని వ్యక్తి, మూడు వందల కోట్లు పెట్టి ఆస్పత్రిని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం చింతా మోహన్ కామెంట్లు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుండడం గమనార్హం.