Begin typing your search above and press return to search.
బాబు కంటే జగనే బెటరు...కాంగ్రెస్ సీనియర్లు
By: Tupaki Desk | 24 Jan 2019 3:49 PM GMTఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకుండా సొంతంగా పోటీ చేయాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకులు కొత్త ప్రత్యామ్నాయాన్ని చూపిస్తున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశామని కాంగ్రెస్ అధిష్టానం తెలుసుకుంది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకో రాదని నిర్ణయించుకుంది. తెలంగాణ ముందస్తు ఎన్నికలతో చంద్రబాబు నాయుడు పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తోందని గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే పరిస్థితి ఉందని అంచనా వేసింది. దీంతో జాతీయస్థాయిలో చంద్రబాబుతో స్నేహం చేయాలని - తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆయనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో జరిగే శాసనసభ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
అయితే, పార్టీ సీనియర్లు మాత్రం చంద్రబాబు నాయుడు కంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డితో స్నేహం చేస్తే కలిసి వస్తుందని అంటున్నారు. చింతా మోహన్ వంటి సీనియర్ నాయకులు జగన్ తో స్నేహం చేయడం పై కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఒప్పిస్తానని ఒక అడుగు ముందుకేశారు. జగన్ తో స్నేహం చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందని - పైగా ఆయన తమ పాత నాయకుడే కాబట్టి ప్రజల నుంచి కూడా వ్యతిరేకత రాదని చింతామోహన్ అంటున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని ముందే ప్రకటించారు. ఇదే నినాదాన్ని వైయస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా ప్రచారం చేస్తే పార్టీకి మేలు చేకూరుతుందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో బొత్స సత్యనారాయణ - అంబటి రాంబాబు తో సహా సీనియర్ నాయకులు ఉన్నారని - వారంతా ఒకప్పుడు కాంగ్రెస్ కు చెందిన వారేనని అంటున్నారు. వైయస్ ఆర్ కాంగ్రెస్ తో చేతులు కలపడం అనేది కాంగ్రెస్ నాయకులు అందరూ ఒక చోటకు చేయడమేనని భాష్యం చెబుతున్నారు. చంద్రబాబు నాయుడుతో రెండున్నర దశాబ్దాల శత్రుత్వాన్ని వదులుకొని చేతులు కలపగా లేనిది తమ పార్టీకే చెందిన వైయస్ జగన్ మోహన్ రెడ్డితో కలిస్తే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే తాము స్నేహహస్తం చాటినా వైయస్ జగన్ మోహన్ రెడ్డి దాన్ని అందుకుంటారని నమ్మకం సీనియర్ నాయకులు లేదంటున్నారు. ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్లు కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి తో చేతులు కలిపే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.