Begin typing your search above and press return to search.
చింతమనేనికి చుక్కలు కనిపించాయా?..2
By: Tupaki Desk | 2 Dec 2015 4:39 AM GMTప్రశ్న; మనలో మన మాట.. ఎమ్మార్వో వనజాక్షి గారి కేసులో అసలేం జరిగింది?
చింతమనేని; అసలేం జరగల. వనజాక్షి గారి కేసులో అసలేం జరగలేదు. ఆమె ఫోకస్ కావాలని ఒక ఎమ్మెల్యే మీద పోరాడిన వీరనారిలా చేయాలని అనుకున్నారే కానీ.. వనజాక్షి గారి విషయంలో అసలే జరగలేదు.
ప్రశ్న; ఒక మహిళా ఎమ్మార్వో మీద మీ అనుచరులు దాడి చేస్తుంటే.. దగ్గరున్న మీరు కనీసం ఆపలేదు?
చింతమనేని; ఆమె ఒక మహిళా ఎమ్మార్వో మాదిరిగా వ్యవహరించలేదు.
ప్రశ్న; మీరు సైగ చేసి కొట్టమనటం నిజం కాదా?
చింతమనేని; సైగ చేస్తే కొడతారండి. డ్వాక్రా సంఘాల వారు.. ఆమె పంపు కాడ ముష్టియుద్ధం చేసుకున్నట్లు కలబడ్డారు. ఏం చెప్పమంటారు..? నేనే విడదీశాను. పక్కకు తీసుకెళ్లి.. కూర్చొబెట్టి.. మంచినీళ్లు ఇచ్చింది నేను. అప్పటివరకూ బాగానే ఉంది. ఎప్పుడైతే మీ టీవీలోళ్లని.. పేపరోళ్లని చూసిందో.. మీకు మసాలా కావాలి కదా. ఈ మధ్య సినిమా వచ్చిందే.. ఆ.. రుద్రమదేవి సినిమాలో రుద్రమదేవిలా ఆమె జీవించింది. ఒక ఎమ్మార్వో విషయంలో ఒక శాసనసభ్యుడు ఎలా వ్యవహరించాలో నాకు తెలీదా? ఎవరి హద్దుల్లో వాళ్లు ఉంటే మంచిది.
ప్రశ్న; మీరు ఎంతమందిని బెదిరిస్తూ వెళతారు? అధికారులు అంటే కించిత్ గౌరవం.. మర్యాద లేదు ఎందుకు?
చింతమనేని; మీరు నా గురించి తిరిగి.. సమాచారం సేకరించి.. గుండె మీద చేయ్యి వేసుకొని.. (మాట్లాడుతుండతానే.. కట్ చేసి..)
ప్రశ్న; ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. సమాచారం సేకరించకుండానే ప్రశ్నలు వేస్తామా?
చింతమనేని; మీకు మసాలా కావాలి. మీరు మా మాట వినండి.. (అడ్డుకుంటూ..)
ప్రశ్న; మీరు మాట మాటికి మసాలా.. మసాలా అంటున్నారు. ఇలా బెదిరింపు ధోరణిలో మీ వాయిస్ ఇస్తే భయపడటానికి నేనేమీ ఎమ్మార్వో వనజాక్షిని కాదు.. మీ చేతిలో దెబ్బలు తిన్న ఎస్ ఐ ఆనంద్ రెడ్డిని కాదు.
చింతమనేని; టీవీలోళ్లకు భయపడటానికి నేనేమీ బకరాగాడిని కాదు.
ప్రశ్న; నేను జర్నలిస్ట్ ని.
చింతమనేని; మీరు జర్నలిస్ట్ కావొచ్చు. మీరు ఏమైనా కావొచ్చు.
ప్రశ్న; నన్ను బెదిరించే ప్రయత్నం చేయకండి.. నా ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వండి.
చింతమనేని; మిమ్మల్ని బెదిరిస్తే.. నాకేమైనా వస్తుందా? మీరు ముఖాముఖి అంటే.. మాట్లాడుకుందాం అన్నారు.. మాట్లాడుకుంటున్నాం. మిమ్మల్ని బెదిరించటం మాకేం అవసరం.
ప్రశ్న; పశ్చిమగోదావరి జిల్లాలో మీ పేరు చెబితే.. పోలీస్ డిపార్ట్ మెంట్ మొత్తం గజగజ వణికిపోతోంది. కారణం ఏమిటి?
చింతమనేని; దేనికి? రీజన్ ఏమిటి?
ప్రశ్న; ఇప్పటికి.. మీ చేతిలో దెబ్బలు తిన్న ఎస్ ఐలు ముగ్గురు ఉన్నారు.
చింతమనేని; అవును.. ముగ్గురు పెట్టారు. దెబ్బలు తినల. ముగ్గురు కేసులు పెట్టారు.
ప్రశ్న; ఒక సీఐ ఎస్సీ.. ఎస్టీ కేసు పెట్టారు. నిజం కాదా?
చింతమనేని; ఆ సీఐ మోహన్ రావుని అడగండి. ఎవరు పెట్టమంటే పెట్టాడో? ఎవరు ప్రేరేపించి కేసు పెట్టించారో మీరు అడగండి.
ప్రశ్న; సీఐ ఆనంద్ రెడ్డి మీద మీరు ఎందుకు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు?
చింతమనేని; నేనేమీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేదు. దీపావళి రోజున బదిలీ అయిన ఆయన నా ఇంటికి వచ్చి వెతుకుతున్నాడు. ఎందుకొచ్చావని అడిగితే.. మాటలు చెప్పాడు. బదిలీ అయితే వెళ్లకుండా నన్ను సాధించటానికి నువ్వు నా ఇంటికి వచ్చావని ప్రశ్నించా. ప్రజాస్వామ్యంలో ఒక పౌరుడిగా ప్రశ్నించే హక్కు నాకుంది. అపోజిషన్లో ఉన్న నేను ప్రశ్నిస్తే.. అతన్ని కొట్టినట్లుగా కేసు పెట్టారు.
ప్రశ్న; మీ మీద 37 కేసులు పెండింగ్ లు ఉన్నాయి. మీ వల్ల పార్టీకి ఏమైనా లాభం జరిగిందా?
చింతమనేని; కేసుల్లో నిజాయితీ లేదు. నా విలువైన సమయం వృధా అయ్యింది. కానీ.. కేసుల వల్ల పార్టీకి లాభం జరిగింది. ప్రజల్లో సింపతీ పెరిగింది. ఇలా.. కేసులు పెట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నట్లు ప్రజలు ఫీలయ్యారు.మానసికంగా ఇబ్బంది పడ్డాను. ఫ్యామిలీ ఇబ్బంది పడ్డారు.
ప్రశ్న; మీ చేతికి ఎముక ఉండదంటారు? రూ.లక్షలు.. లక్షలు విరాళాలు ఇస్తారని చెబుతారు. ఇంత డబ్బు ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు?
చింతమనేని; లక్షలు లక్షలు సాయం చేయటానికి దానకర్ణుడ్ని కాదు. ఇల్లు కాలిపోయిన వారికి వంట సామాను కొనిస్తాను. బట్టలు లేకపోతే బట్టలు కొనిస్తాను.
ప్రశ్న; రాయలసీమలో ఫ్యాక్షనిస్ట్ ఇళ్లల్లో నిత్యం అన్నదాన కార్యక్రమం జరుగుతుంటుంది. మీ ఇంట్లోనూ అలానే జరుగుతుంటుందే?
చింతమనేని; ఫ్యాక్షన్ ఫ్యామిలీతో నాకు సంబంధాల్లేవు. ఫ్యాక్షనిస్ట్ లను నేను చూడలేదు. మీలాంటి వాళ్లు చెబితే వినటమే తప్పించి చూసింది లేదు. ఇంటికి వచ్చిన వారికి ఒక పూట అన్నమైనా పెట్టాలన్న ఉద్దేశ్యంతోనే పెడతాను తప్పించి మరొకటి కాదు.
ప్రశ్న; సీఎం చంద్రబాబు రౌడీయిజాన్ని రూపుమాపుతానని చెబుతున్నారు. కానీ ఒక రౌడీని తెచ్చి పెట్టుకున్నారే?
చింతమనేని; నేను రౌడీని కాదు కదా. నేను రౌడీని అయితే నన్ను బయటకు తోసేసేవారు.
ప్రశ్న; రౌడీషీట్ ఉంటే రౌడీ కాదా?
చింతమనేని; రౌడీషీట్ ఉన్నంత మాత్రాన ఆ కోణంలో చూడొద్దని అంటున్నాను.
ప్రశ్న; మీలో కరుడుగట్టిన రౌడీ ఉన్నాడనటానికి గత ఎన్నికల్లో మీకు ఓటు వేయని కొన్ని గ్రామాల్ని సాంఘిక బహిష్కరణ చేశారు. నిజం కాదా?
చింతమనని; మీరు సాంఘిక బహిష్కరణ లాంటి పెద్ద పదాల్ని వాడొద్దు. మీరు మాట్లాడే మాటల్లో వాస్తవం లేదు. మీరు చేసిన ఆరోపణల్ని నిరూపించండి. వెళదాం పదండి (అంటూ బయలుదేరే ప్రయత్నం చేశారు)
ప్రశ్న; ఈ ఇంటర్వ్యూలో చింతమనేని ప్రభాకర్ లో మరో కోణం చెప్పాలి. స్వీయ దర్శకత్వంలో మీరు హీరోగా ఒక సినిమా తీస్తున్నారట కదా?
చింతమనేని; అవును. తీద్దామని అనుకుంటున్నా. త్వరలోనే చెబుతా. నేనే హీరోగా ఉంటా. సినిమా తీద్దామని అనుకుంటున్నా.
ప్రశ్న; దాని టైటిల్.. ఏంటి?
చింతమనేని; చెబుతా.
ప్రశ్న; నేను రౌడీ.. ఎవరి మాటా వినను ఆ రకంగా ఉంటుందా?
చింతమనేని; రౌడీ అని పెడతానో.. సేవకుడ్ని అని పెడతానో.. నాయకుడ్ని అని పెడతానో.. ఆ మసాలా ఏంటో చూద్దువు కదా.