Begin typing your search above and press return to search.
అబ్బాయి చౌదరికి ఉద్యోగం ఇప్పించింది చింతమనేనా?
By: Tupaki Desk | 2 Feb 2022 1:30 AM GMTపశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, యువ నాయకుడు.. అబ్బయ్య చౌదరి రాజకీయాల్లోకి రాకముం దు.. లండన్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసేవారు. 2014 తర్వాత.. ఆయనకు వైసీపీ నేతలతో పరిచయాలు ఏర్పడి.. ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ పిలుపుమేరకు ఆయన పార్టీలో చేరారు.. ఈ క్రమంలోనే.. అనూహ్యంగా 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున దెందులూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. టీడీపీ సీనియర్ నాయకుడు.. ఫైర్ బ్రాండ్ చింతమనేని ప్రభాకర్‌పై విజయం దక్కించుకున్నా రు. అప్పటి నుంచి చింతమనేని వర్సెస్ అబ్బయ్య చౌదరి మధ్య వివాదాలు తారస్థాయిలో జరుగుతున్నాయి.
కొన్ని కొన్ని కేసులు.. అబ్బయ్య చౌదరి ప్రోత్సాహంతోనే చింతమనేనిపై పోలీసులు పెడుతున్నారనే వాదన ఉంది. ఇక, ఇటీవల చింతమనేని ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ.. అబయ్య చౌదరి గురించి వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. సహజంగా.. తనపై పోటీ చేసి.. తనను ఓడించాడు కనుక.. రాజకీయంగా టీడీపీ, వైసీపీలు బద్ధ శత్రువులుగా ఉన్న నేపథ్యంలో ఇలా చింతమనే ని అని ఉంటారని అనుకుంటే.. పొరపాటే. ఎందుకంటే.. చింతమనేని సహాయంతోనే అబ్బయ్య చౌదరి విదేశాల్లో ఉద్యోగం తెచ్చుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా చింతమనేని ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
అబ్బయ్య చౌదరికి తానే విదేశాల్లో ఉద్యోగం ఇప్పించానని.. తాను తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు.. తనను అడగడంతో ఈ సాయం చేశానని.. చింతమనేని చెప్పారు. ఏదో అబ్బయ్య కు టైం కలిసి వచ్చి.. గెలిచాడని.. తన టైం బాగోలేక ఓడిపోయానని చెప్పారు. సుమారు 17 వేల ఓట్ల తేడాతో తాను గత ఎన్నికల్లో గెలుపునకు దూరమయ్యాయని చెప్పారు. అయితే.. ఇప్పుడు తన పట్ల ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటున్నారని.. తనవైపు మళ్లుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అబ్బయ్య చేసిన రాజకీయం తాను మరిచిపోలేనని చెప్పారు. ఏమాత్రం స్పందన లేని వ్యక్తి అని చింతమనేని వ్యాఖ్యానించారు.