Begin typing your search above and press return to search.
రాత్రి వేళ బాబును కలిసిన చింతమనేని!
By: Tupaki Desk | 27 April 2018 4:25 AM GMTవివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు కొందరు నేతలు. అలాంటి వారిలో ముందుంటారు ఏపీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. పార్టీ మీద బోలెడంత అభిమానం ఉన్నట్లుగా చెబుతూ.. ఇష్టారాజ్యంగా వ్యవహరించటంలో ఆయన తర్వాతే ఎవరినైనా. కోపం వస్తే బూతులు తిట్టేయటం.. మరికాస్త ఎక్కువ కాలితే చేతికి.. కాలికి పని చెప్పటం ఆయనకు అలవాటే.
తన తీరుతో పార్టీకి నష్టం జరుగుతుందంటే.. అందుకు ససేమిరా అంటారు. తన తీరుతో పార్టీ పట్ల భయంభక్తి పెరుగుతుందని.. క్రమశిక్షణ కోసమే తాను అలా చేయాల్సి వస్తుందంటూ ఆయన చెప్పే కవరింగ్ మాటలు వింటే అవాక్కు అవ్వాల్సిందే. ఇటీవల ఆర్టీసీ బస్సు మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో పోస్టర్ కాస్త చినిగిపోయిన వైనాన్ని చూసిన చింతమనేని వారి కడుపు మండింది.
అరే.. దేవుడు లాంటి బాబు ఫోటో బస్సు మీద చినిగి ఉండటమా? అలాంటి వైనాన్ని సదరు ఆర్టీసీ బస్సు.. డ్రైవర్, కండక్టర్ పట్టించుకోకపోవటమా? బస్సులో ఎక్కిన ప్రయాణికుల మంచి చెడ్డలు చూసినా.. చూడకున్నా ఫర్లేదు కానీ.. బస్సు మీద అంటించిన బాబు బొమ్మకు ఏం కాకూడదన్నది తెలీదా? మరీ.. ఇంత భాద్యతారాహిత్యంతో వ్యవహరించే వారికి దండోపాయమే కరెక్ట్ అన్నది నమ్మి మరీ వారిపై చెలరేగిపోయిన వైనం ఈ మధ్యన వివాదం కావటంతో సీఎంవో నుంచి చింతమనేని సార్ వారికి ఫోన్ వచ్చింది.
ఈ నేపథ్యంలో బాబుతో భేటీకి గురువారం రాత్రిని టైం ఫిక్స్ చేశారు. తన చర్యలతో దేవుడులాంటి బాబును కలిసే మహత్ భాగ్యం కలగటంతో పులకరించినపోయిన చింతమనేని.. సీఎంవో చెప్పినట్లే రాత్రికి సీఎం బాబును కలిసేందుకు రెఢీ అయిపోయారు. తన తీరుతో పాడు మీడియా రచ్చ చేయటం.. అలాంటివి లోగుట్టుగా జరిగితే వోకే కానీ(?).. బయటకు పొక్కి రచ్చ కావటం అస్సలు నచ్చని బాబు పిలిచి క్లాస్ పీకినట్లుగా చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం చింతమనేని తీరుపై ఆగ్రహంగా ఉన్న బాబు మూడ్ ను గుర్తించిన ఆయన.. తాను చేసిన పనికి సారీ చెప్పినట్లుగా చెబుతున్నారు. మొత్తానికి రాత్రి వేళ బాబును కలిసి వినయంతో చింతమనేని చెప్పిన సారీకి బాబు సర్లే.. జాగ్రత్తగా ఉండు.. అసలే ఎలక్షన్ టైం అని చెప్పినట్లుగా చెబుతున్నారు. అంతకు మించి బాబు మాత్రం చేయగలిగింది ఏముంది? చింతమనేని లాంటోళ్లపై వేటు వేసేంత దమ్ము.. ధైర్యం లేని వేళ.. అదిలించి.. బెదిరించి పంపించటం తప్ప ఇంకేం చేయగలరు?