Begin typing your search above and press return to search.
పవన్ కు చింతమనేని సవాల్
By: Tupaki Desk | 27 Sep 2018 9:04 AM GMTజనసేన అధినేత పవన్ కల్యాణ్ - దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మధ్య మొదలైన మాటల యుద్ధం తారస్థాయికి చేరుతోంది. చింతమనేనిపై చాలా కేసులున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ పవన్ బుధవారం చేసిన వ్యాఖ్యలపై చింతమనేని ఘాటుగా స్పందించారు. వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శలు చేయడమేంటని ఎదురు ప్రశ్నించారు. దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాని పవన్ కు సవాలు విసిరారు.
పవన్ కల్యాణ్ రాష్ట్ర స్థాయి నాయకుడి నుంచి నియోజకవర్గ సమన్వయకర్త స్థాయికి పడిపోయారని చింతమనేని ఎద్దేవా చేశారు. తనను హత్య చేయడానికి ప్రయత్నించిన వ్యక్తులతో ఆయన కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. దెందులూరులో చావో రేవో తేల్చుకుందామని.. దమ్ముంటే తనపై పోటీ చేయాలని పవన్‌కు సవాల్ విసిరారు. తాను ఓడిపోతే పవన్ విజయోత్సవ ర్యాలీలో పాల్గొంటానని.. గెలిస్తే పవన్ తనతో కరచాలనం చేస్తే అదే చాలనకుంటానని పేర్కొన్నారు. మీ ఛానెల్‌లో నన్ను అసెంబ్లీ రౌడీ అని ప్రచారం చేస్తున్నారు. నా కుమారుడు అది చూసి నన్ను ప్రశ్నించాడు. అసెంబ్లీ రౌడీ సినిమాలో శివాజీ ఎలా గెలిచాడో... నేను కూడా అలాగే గెలిచి వస్తా అని పవన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
పవన్ తననొక్కడినే టార్గెట్ చేస్తున్నారని చింతమనేని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డితోపాటు ఆ పార్టీలోని పలువురు నేతలపై కేసులున్నాయని గుర్తుచేశారు. వారిపై నోరెందుకు విప్పడం లేదని పవన్ ను ప్రశ్నించారు.