Begin typing your search above and press return to search.

వంద కేసులు పెట్టినా తగ్గేదేలే: చింతమనేని హాట్ కామెంట్స్

By:  Tupaki Desk   |   29 Jan 2022 4:45 AM GMT
వంద కేసులు పెట్టినా తగ్గేదేలే: చింతమనేని హాట్ కామెంట్స్
X
‘నేనెప్పుడు ఎవ్వరికీ భయపడను... జగన్మోహన్ రెడ్డి లాగా రేపు న్యాయస్థానంలో ఏం జరుగుతుందోనన్న భయం నాకస్సుల లేదు.’ అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమ ప్రోమోలో ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నేను మా పార్టీ అధికారంలో ఉన్నా.. లేకపోయినా నేను ఎప్పటికీ భయపడలేను.. అని అన్నారు. అలాగే ‘తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి తప్పు మాది ఉంది.. చంద్రబాబుది కూడా తప్పు ఉంది.. వద్దంటే రోడ్లు వేసిన చంద్రబాబు తప్పే కదా.. మేం అడగకముందే రోడ్లు వేయడం తప్పే కదా..’ అని అన్నారు.

అయితే నాపై ఎన్నో కేసులు ఉన్నాయి. కానీ అవి ఎందుకు పనికి రావు. నాపై రౌడిషీటర్ తీయమని మా పార్టీ అధికారంలో ఉన్నపుడు చాలా సార్లు ఎదురైంది. కానీ ఇప్పటికీ ఎవరూ తీయట్లేదు.. ఎందుకంటే అది మెడల్.. అయితే కేసులు ఉన్నవారు ఎప్పటికైనా జైలుకు వెళ్లి వస్తారు.. నేను కూడా సందర్భం వస్తే వెళ్తాను కావచ్చు.. కానీ నన్ను కొట్టాలంటే ఎన్ని గుండెలు కావాలి..నలుగురు కానిస్టేబుళ్లతో నన్ను కొట్టిస్తారు..నేను మళ్లీ చూసుకోనా..? అంటే నాకు గిప్ట్ ఇచ్చిన వాళ్లకు రిటర్న్ గిప్ట్ ఇవ్వాలి కదా..నాకు బాధ కలిగి వారిని అనరాని మాటలు కూడా అన్నారు. కానీ వాళ్లను ఏం మాటలు అన్నానో చెప్పుకోవడానికి భయపడ్డారు.

టీవీ ఛానెళ్ల వ్యూస్ కోసం నన్ను బకరాలాగా చూశారు.. వనజాక్షిని కూడా ఈ కార్యక్రమంలోకి తీసుకొస్తే బాగుండేది..ఆ పునుగులు తెప్పించుకొని ఎగరేసేంది.. అయితే ఆమెకు మంచి ఇమేజ్ వచ్చింది. మేం బకరాలమ్యాం.. కానీ ఆమెకు గుర్తింపు వచ్చింది.. తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి మా తప్పు ఉంది.. కానీ మా నాయకుడు చంద్రబాబు తప్పు కూడా ఉంది... ఎందుకంటే అడగకుండానే రోడ్లు వేయడం తప్పు కాదా..? మేం అడగకుండానే మాతో సిమెంట్ రోడ్లు వేయడం తప్పే కదా..?

చంద్రబాబుకు ఎదరు తిరిగా..సొంత పార్టీ పెట్టుకుంటానని కూడా చెప్పా..నాకు బాధ కలిగింది అన్నాను.. మా నియోజకవర్గంలో నామీద గెలిచిన ఎమ్మెల్యే చిన్న పిల్లాడు.. ఆయన గురించి మాట్లాడడం పెద్ద మ్యాటర్ కాదు... టైం వేస్టు.. అతనిపై కోపం ఏం లేదు.. జీవితంలో ఎన్నో అనుభవాలు జరిగాయి... కానీ నా ప్రవర్తనలో ఎటువంటి మార్పు ఉండదు.. నేనేంటో అలాగే ఉంటాను..నేను మారి సమాజానికి ఏం మెసేజ్ ఇయ్యగలను..?ఇప్పుడున్న మంత్రులు నాకంటే సమర్థులేం కాదు.. సంక్రాంతి సందర్భంలో కోడి పందాలు బాగా ఆడాను.. టైం బాగోలేకపోవడంతో డబ్బులు పోయాయి.. మిగతా విషయాల్లో టైం బాగున్నా.. కోడి పందాల్లో అచ్చిరాలేదు. కొడాని నాని మిత్రుడు అనే పదానికి అర్థం మారిపోతుంది.. నా కూతురు పెళ్లికి కూడా ఆయనను పిలవలేదు..