Begin typing your search above and press return to search.
నేను మారను.. ఇంతే! తేల్చి చెప్పిన చింతమనేని!
By: Tupaki Desk | 1 Feb 2022 3:30 PM GMTచింతమనేని ప్రభాకర్.. కొంత గర్వం.. మరికొంత దర్పం కలిపి మనిషిని చేస్తే.. ఆయన ప్రత్యక్ష మవుతారని పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలే కాదు.. సొంత పార్టీ టీడీపీ నాయకులు కూడా అంటారు. ఏం జరిగినా.. వెరుపు లేదు. ఎన్ని కేసులు నమోదైనా.. ఆయన వెనక్కి తగ్గేదేలే! అంటున్నారు. తాజాగా ఒక మీడియాకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వైఖరికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ``నాలో మారడానికి ఏముంది? నేను మారను. ఈ జీవితం ఇంతే!`` అని కుండబద్దలు కొట్టారు. తన ఇంటికి వచ్చేవారికి గౌరవం ఇస్తానని.. తనను తిట్టే వారికి అలానే సమాధానం చెబుతానని అన్నారు.
నిజానికి గత ఎన్నికలకు ముందు.. జీవితాంతం ఇక్కడి ప్రజలు తననే గెలిపిస్తారని ప్రభాకర్‌చెప్పారు. అయితే.. గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. పైగాతనచుట్టు ఉన్న అనుచరులు కూడా వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయన చెప్పినట్టు చింతమనేని పక్కన కేవలం ఆయన డ్రైవర్, పీఏ తప్ప.. ఎవరూ లేరు. అదేసమయంలో ప్రజలకు కూడా ఆయన దూరమయ్యారు. ఇన్ని ఎందుకు జరుగుతున్నాయనే ఆత్మ పరిశీలన చేసుకున్నా.. తాను మారాల్సి అవసరం లేదని అన్నారు. ఎందుకంటే..తనను ఒక విలన్‌గా ప్రొజెక్ట్ చేసింది మీడియానేనని.. లేకపోతే.. కొందరు నాయకులు ఉన్నారని చెప్పారు. ముందు వారు మారాలని.. చింతమనేని చెప్పారు.
ఎవరైనా సరే.. తనలో ఉన్ననెగిటివ్ కోణాన్ని ప్రచారం చేసినట్టుగా.. పాజిటివ్ కోణాన్ని ప్రచారం చేయలేదని చింతమనేని విమ ర్శించారు. తను ఎంతో మందికి ఇళ్లు కట్టించానన్నారు. ఎంతో మందికి ఆర్థిక సాయం అందించానని తెలిపారు. అయినప్పటికీ.. తనను నెగిటివ్‌గానే ప్రచారం చేశారని చెప్పారు. ప్రజల పట్ల, వారి సమస్యల పట్ల ఎప్పుడూ..తాను సానుకూల ధోరణితోనే ఉన్నానని చింతమనేని వ్యాఖ్యానించారు. పార్టీ విషయంలోనూ ఎప్పుడూ లైన్ దాటలేదని.. అధినేత చెప్పినట్టే నడుచుకున్నానన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తనపై కేసులు పెట్టారని చెప్పారు. ఏం జరిగినా.. మరో 20 ఏళ్లు జీవిస్తానని.. ఇప్పటి వరకు అనుభవించిన జీవితాన్ని ఒక్కసారిగా మార్చుకోవాల్సిన అవసరం కూడా తనకు లేదని అన్నారు. తను ఇంతేనని.. వెల్లడించారు.