Begin typing your search above and press return to search.
నన్ను డ్యామేజీ చేసింది మీడియానే: చింతమనేని సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 1 Feb 2022 12:30 PM GMTటీడీపీ నేత చింతమనేని అంటేనే ఫైర్ బ్రాండ్. ఆయన ఏం మాట్లాడినా.. ఫైర్. ఆయన ఏం చేసినా ఫైర్! వివాదాలతోనే కాలం వెళ్లబుచ్చుతారని.. ఆయనకు పెద్ద పేరు కూడా ఉంది. అయితే... తాను అత్యంత సాధుస్వభావినని.. కేవలం మీడియానే తనతో ఆడుకుందని... తన రాజకీయ జీవితాన్ని.. బద్నాం చేసిందని.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక మీడియకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చింతమనేని మీడియాపైనే విమర్శల బాణాలు సంధించారు. తనను రెండో కోణంలో చూపించడం వల్లే.. చింతమనేని అంటే... వివాదాస్పద నేత అనే మాట వచ్చిందని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా ఆయన పలు ఉదాహరణలు చెప్పారు. దళితులను తాము ఏమీ అనకపోయినా.. అన్నట్టు మీడియా ప్రచారం చేసిందన్నారు. నిజానికి తాను దళితులతో మాట్లాడిన పూర్తిస్థాయి వీడియోను ఇప్పటి కైనా ప్రసారం చేస్తే.. తాను దళితులను ఏమన్నానో.. నిజాలు బయటకు వస్తాయన్నారు. ఇక, తన వ్యాఖ్యలను కూడా వక్రీకరించారని... చెప్పుకొచ్చారు. దీనికి కారణం.. తాను మీడియాను మేనేజ్ చేయకపోవడమే కారణమని.. చెప్పారు. తనవద్దకు అనేక మంది మీడియా ప్రతినిధులు వస్తారని.. వారికి డబ్బులు ఇచ్చే అలవాటు తనకు లేదని.. అయితే... న్యాయబద్ధంగా ఏదైనా సమస్యతో వాటిని పరిష్కరించిన సందర్భాలు ఉన్నాయన్నారు.
తాను డబ్బులు ఇవ్వను కాబట్టే.. క్షేత్రస్థాయిలో ఉండే.. మీడియా ప్రతినిధులుతనను విలన్‌గా చిత్రీకరిం చారని చెప్పుకొచ్చారు. తాను అనని మాటలు కూడా కల్పించి ప్రచారం చేశారని.. చెప్పారు. గత ఎన్నికలలో తాను మీడియా చేసిన అతివల్లే కొంత ఓడిపోయిన మాట వాస్తవమేనని చెప్పుకొచ్చారు. అయితే.. అతిగా ఊహించుకోవడమూ తాను చేసిన ప్రథమ తప్పు అని చెప్పారు.
నిజానికి మీడియాతో తనకు విభేదాలు లేవని.. అయితే.. తాను మీడియాను మేనేజ్ చేయకపోవడం వల్లే..తనను ఇలా చేశారని.. ముఖ్యంగా తహసీల్దార్ వనజాక్షి విషయంలో నేను అక్కడకు వెళ్లి ఉండకపోయినా.. వెళ్లిన తర్వాత.. అక్కడి వివాదం సమసి పోయే వరకు అక్కడే ఉన్నా.. మీడియాలో మరో లా వచ్చి ఉండేదని చెప్పుకొచ్చారు.