Begin typing your search above and press return to search.
చింటూ లేఖ వచ్చిన పత్రికాఫీసు ఏది?
By: Tupaki Desk | 29 Nov 2015 4:35 AM GMTచిత్తూరు మేయర్ కటారి అనురాధ.. ఆమె భర్త మోహన్ ను దారుణంగా హత్య చేసిన ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న చింటూ నుంచి తాజాగా ఒక లేఖ వచ్చింది. ప్రముఖ మీడియా సంస్థ ‘ఈనాడు’ చిత్తూరు కార్యాలయానికి ఈ లేఖను చింటూను రాసినట్లుగా చెబుతున్నారు. ఈనాడు కార్యాలయానికి రాసిన లేఖను సదరు పత్రికా కార్యాలయంతో పాటు.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. పోలీసు ఉన్నతాధికారులకు రాయటం గమనార్హం.
ఈనాడు కార్యాలయానికి రాసిన లేఖలో చింటూ.. రెండు హత్యల్ని తాను చేయలేదని.. వాటితో తనకే మాత్రం సంబంధం లేదని పేర్కొన్నారు. తాను పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు సిద్ధమన్నారు. ఈనాడు కార్యాలయంతో సహా మొత్తం 9 చిరునామాలకు లేఖ ప్రతి పంపుతున్నట్లుగా పేర్కొన్నారు.
‘‘మేయర్ దంపతుల హత్యలతో నాకు ఎలాంటి సంబంధమూ లేదు. పోలీసుల ఎదుట లొంగిపోవటానికి సిద్ధంగా ఉన్నా’’ అని పేర్కొన్నారు. ఈ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లేఖలోని దస్తూరి చింటూదేనని తేల్చినట్లుగా సమాచారం.