Begin typing your search above and press return to search.
చెప్పినట్లే.. చింటూ లొంగిపోయాడు
By: Tupaki Desk | 30 Nov 2015 6:51 AM GMTచిత్తూరు జిల్లా మేయర్ అనురాధ.. ఆమె భర్త మోహన్ హత్యల కేసుల్లో ప్రధాన నిందితుడైన చింటూ లొంగిపోయాడు. రెండు రోజుల క్రితం ఈనాడు పత్రికా కార్యాలయానికి.. ముఖ్యమంత్రికి.. పలువురు పోలీసు ఉన్నతాధికారులకు లేఖలు రాసిన చింటూ.. లేఖలో పేర్కొన్నట్లే.. కోర్టులో లొంగిపోయాడు. చిత్తూరు జిల్లా కోర్టులో నాటకీయంగా చింటూ లొంగిపోయాడు.
మేయర్ అనురాధ హత్యలో నేరుగా చింటూ పాల్గొన్నాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. హత్యలు చేసిన తర్వాత పారిపోయినట్లుగా భావిస్తున్న చింటూ.. విదేశాలకు పారిపోతాడన్న వాదన వినిపించింది. ఈ నేపథ్యంలో అతని ఆర్థిక లావాదేవాల్ని నిలిపివేయటం.. బ్యాంకు అకౌంట్లు.. పాస్ పోర్ట్ ను స్వాధీనం చేసుకోవటం ద్వారా పోలీసులు ముందస్తుగా వ్యవహరించారు.
మరోవైపు.. చింటూకు చెంది ప్రధాన అనుచరులు ముగ్గురిని ఈ మధ్యనే పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కోర్టు ఎదుట లొంగిపోయిన చింటూను విచారిస్తే.. మేయర్ అనురాధ కేసులోని చిక్కుముడులు వీడిపోతాయన్న మాట వినిపిస్తోంది. మేయర్.. ఆమె భర్తల హత్యల్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని.. నిందితుల్ని వెంటనే పట్టుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించిన తర్వాత కూడా పోలీసులు చింటూను అదుపులోకి తీసుకోకపోవటం.. అతనే.. తనకు తానుగా కోర్టుకు లొంగిపోవటం గమనార్హం.