Begin typing your search above and press return to search.
రజినీ - కమల్ లకు చిరంజీవి కీలక సలహా
By: Tupaki Desk | 26 Sep 2019 11:11 AM GMTఆయన టాలీవుడ్ మెగా స్టార్ గా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి అదృష్టం పరీక్షించుకున్నారు. కానీ బ్యాడ్ లక్. పార్టీ గెలవలేదు.. చిరు ప్రస్తానం సాగలేదు. దీంతో ఇక ప్రజారాజ్యంను కాంగ్రెస్ లో విలీనం చేసి రాజకీయాలకు పూర్తి దూరంగా జరిగారు చిరంజీవి. ఇప్పుడు మళ్లీ సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు.
అయితే తన జీవితంలోనే రాజకీయాల్లోకి వెళ్లి పెద్ద తప్పు చేశాననే బాధ ఆయనను వెంటాడుతుంటుందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. తాజాగా ‘సైరా’ తమిళనాడు ప్రమోషన్ కోసం తన సన్నిహితులు - సీనియర్ హీరోలు రజినీకాంత్ - కమల్ హాసన్ సాయాన్ని చిరంజీవి కోరినట్టు తెలిసింది.. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వారిద్దరికీ కీలక సూచన చేసినట్టు సమాచారం.
త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్న రజినీకాంత్ తోపాటు ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చి అదృష్టం పరిక్షించుకున్న కమల్ హానన్ లకు చిరంజీవి తన రాజకీయ అనుభవం గురించి పూసగుచ్చినట్టు తెలిసింది. ప్రస్తుత రాజకీయాలు కులం - ధనం ప్రాతిపదికగా నడుస్తున్నాయని.. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వెళ్లి మీ సమయాన్ని వృథా చేసుకోవద్దని చిరంజీవి తాజాగా రజినీ - కమల్ లకు సలహా ఇచ్చినట్టు తెలిసింది. మీ మంచికోరే మిత్రుడిగా రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిదని చిరంజీవి వారిద్దరికీ సూచించినట్టు తెలిసింది.