Begin typing your search above and press return to search.
రాష్ర్టపతి ఎన్నికల్లో తొలి, చివరి ఓట్లర్లు తెలుగోళ్లే
By: Tupaki Desk | 29 Jun 2017 4:55 AM GMTరాష్ర్టపతి ఎన్నికలకు రంగం సిద్ధమైపోయింది. ఈ ఎన్నికల్లో ఓటేయాల్సిన ఓటర్లతో కూడిన ఎలక్టోరల్ కాలేజి జాబితాను కూడా రూపొందించారు. ఉభయ సభల ఎంపీలు - రాష్ర్టాల్లోని ఎమ్మెల్యేలు అంతా ఇందులో ఉంటారు. అయితే... ఈ జాబితాలో మొట్టమొదటి పేరు - చిట్ట చివరి పేరు కూడా ఇద్దరు తెలుగువారిదే కావడం విశేషం.
రాష్ర్టపతి ఎన్నికల ఎలక్టోరల్ కాలేజి జాబితాలో మొట్టమొదటి పేరు కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ - సినీ హీరో చిరంజీవిది కాగా చిట్టచివరి పేరు కూడా మరో తెలుగు వ్యక్తిదే. అయితే ఆయన వేరే రాష్ర్టానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పాండిచ్చేరి రాష్ర్టానికి చెందిన యానాం నియోజకవర్గ ఎమ్మల్యే మల్లాడి కృష్ణారావు పేరు ఈ జాబితాలో చిట్టచివరన ఉంది. యానాం పాండిచ్చేరి రాష్ర్టానికి చెందినప్పటికీ అది భౌగోళికంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. మల్లాడి కూడా తెలుగువారు.
ఇంకో విశేషమేంటంటే ఈ ఇద్దరూ కూడా కాంగ్రెస్ నేతలే. అయితే.. మల్లాడి కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలంగా ఉంటూ మచ్చలేని నేతగా - పార్టీకి విధేయుడిగా పేరున్నవారు. కానీ... చిరంజీవి తన సొంత పార్టీ ప్రజారాజ్యాన్ని మూసేసిన తరువాత కాంగ్రెస్ లోకి వచ్చి తన ఫేమ్ కారణంగా పదవులు పొందిన వ్యక్తి. పైగా ప్రస్తుతం ఆయన పార్టీతో అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. ఈ సంగతులన్నీ ఎలా ఉన్నా ఇద్దరు తెలుగువారు రాష్ట్రపతి ఎన్నికల ఎలక్టోరల్ కాలేజిలో తొలి, చివరి ఓటర్లుగా ఉండడం ఆసక్తికరమే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/