Begin typing your search above and press return to search.
కర్ణాటక సీన్:చిరు ఒక పార్టీ..పవన్ మరో పార్టీ !
By: Tupaki Desk | 8 April 2018 3:19 PM GMTకన్నడ రాష్ట్రంలో ఎన్నికల హీటెక్కుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా - కాంగ్రెస్ రథసారథి రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలో చుట్టేస్తూ వేడిని పుట్టిస్తుండగా.. ఇదే సమయంలో ఆ రాష్ట్రంలోని పాతుకుపోయిన జేడీఎస్ సైతం ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. అయితే కన్నడ వేడిలోకి తెలుగు ప్రముఖ నటుల ఎంట్రీ కూడా మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి - ఆయన సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఈ రాష్ట్ర ఎన్నికల పోరులో భాగస్వామ్యం పంచుకోనున్నారని సమాచారం. కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున మెగాస్టార్ చిరంజీవి - జేడీఎస్ తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది.
వరుస ఎదురుదెబ్బలతో బీజేపీ - ఇటీవలి కాలంలో పుంజుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల్లో ఆసక్తికరమై ముద్ర వేసుకుంటున్న కాంగ్రెస్ హోరాహోరి పోరుతో కర్ణాటక ఎన్నికలు జాతీయ స్థాయిలో ఆసక్తికరంగా మారాయి. కర్ణాటకలో దూరమైన అధికారాన్ని తిరిగి సాధించుకునే యత్నాల్లో బీజేపీ ఉండగా - మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న కృత నిశ్చయంతో సిద్ధరామయ్య దూసుకెళుతున్నారు. ఇటీవలి ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రజలు ఉన్నారని చెప్పినప్పటికీ, ఎన్నికలకు మరో నెల రోజుల సమయం ఉండటంతో ఈ రంఎడు పార్టీల రథసారథులైన అమిత్ షా, రాహుల్ గాంధీ తమ చెమటోడుస్తున్నారు. ఈ సమయంలో వారు అందివచ్చే ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. కర్నాటకలో తెలుగువారు కీలక స్థానంలో ఉండటంతో సినీ నటులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.
కర్ణాటక - ఆంధ్రా సరిహద్దు జిల్లాలైన బళ్లారి - గుల్బర్గా - బీదర్ తదితర ప్రాంతాల్లో జయాపజయాలను నిర్ణయించగలిగే స్థాయిలో తెలుగు ఓటర్లు ఉన్నారు. మరోవైపు బెంగళూరులోనూ పెద్ద సంఖ్యలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు తెలుగువారే. దీంతో వారిని ఆక్టుటకునేందుకు మెగా బ్రదర్స్ ను ఆయా పార్టీలు రంగంలోకి దింపుతున్నాయి. తాజా కర్ణాటకలో ప్రచారం జరుగుతున్న ప్రకారం ఇప్పటికే కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి షెడ్యూల్ ఖరారైంది. త్వరలో పవన్ టూర్ సైతం ఓకే కానుందని, ఆయన జేడీఎస్ తరఫున ప్రచారం చేయనున్నారని అంటున్నారు.