Begin typing your search above and press return to search.
నాడు చిరు - నేడు పీకే.. రెండు సార్లూ కాపులే బలి పశువులు
By: Tupaki Desk | 16 Jan 2020 7:18 AM GMTతెలుగు నేల రాజకీయాల్లో బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపులకు అధికారం అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. తెలుగు నేలలో ప్రత్యేకించి ఏపీలో ప్రధాన సామాజిక వర్గాలైన రెడ్డి - కమ్మ సామాజిక వర్గాలకు ఏమాత్రం తీసిపోని విధంగా సత్తా చాటుతున్న కాపులు... ఏపీలో అధికారం చేజిక్కించుకునే దిశగా ఎప్పటికప్పుడు వ్యూహాలు అమలు చేస్తూనే ఉన్నారు. అయితే ఆ వ్యూహాలు ఎప్పటికప్పుడు బెడిసికొడుతుండగా... తమ సొంత సామాజిక వర్గానికి చెందిన నేతల కారణంగానే కాపులకు అధికారం అందని ద్రాక్షగా మారిపోయిందన్న వాదనలు ఇప్పుడు బలంగానే వినిపిస్తున్నాయి. అయినా ఇప్పుడు ఈ చర్చ ఎందుకన్న అంశానికి వస్తే... కాపు ఓట్లతో మేజిక్ చేద్దామని జనసేన పేరిట పార్టీ పెట్టిన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్... ఇప్పుడు బీజేపీతో కలిసి సాగడమో - లేదంటే ఏకంగా తన పార్టీని బీజేపీలో విలీనం చేయడానికో దాదాసుగా సిద్ధమైపోయారు. బీజేపీలో జనసేన విలీనం కాకున్నా కూడా... భవిష్యత్తులో బీజేపీకి ఓ తోకగా జనసేన మిగిలిపోనుంది. వెరసి కాపుల ఆశలపై పవన్ నీళ్లు చల్లేస్తున్నారన్న మాట.
పవన్ చర్యతో కాపులకు అధికారం అందకుండా పోతోందన్న వాదన ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర లేపింది. కాపుల ఆశలపై పవన్ ఇప్పుడు నీళ్లు చల్లుతుంటే... ఆయన కంటే ముందే... స్వయానా ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడో నీళ్లు చల్లేశారన్న మాట కూడా ఇప్పుడు గుర్తుకు వస్తోంది. 2009లో ప్రజారాజ్యం పేరిట చిరు పార్టీని పెడితే... దశాబ్దాల తరబడి అధికార కాంక్ష తీరబోతోందన్న భావనతో చిరు వెంట కాపులంతా నడిచారు. అయితే 2009 ఎన్నికల్లో చిరు పార్టీ అనుకున్న మేర సత్ఫలితాలను సాధించలేకపోయింది. అయినా కూడా వెనుకాడని కాపులు ఆయన వెన్నంటే నడిచేందుకు సిద్ధపడ్డారు. వీరి ఆశలను - ఆశయాలను ఏమాత్రం పట్టించుకోని చిరు... తన పార్టీని నాటి అధికార పార్టీ కాంగ్రెస్ లో కలిపేసి కాపుల అధికార ఆశలపై నీళ్లు చల్లేశారు. చిరు చర్యతో లోలోపలే మదనపడిపోయిన కాపులు.. 2014లో పవన్ జనసేన పేరిట పార్టీ పెడితే... మరోమారు జనసేన వెంట నడిచేందుకు కాపులంతా సిద్ధపడిపోయారు.
అయితే 2014 ఎన్నికల్లో అసలు ప్రత్యక్ష బరికే సిద్ధపడని పవన్... టీడీపీ - బీజేపీ కూటమికి మద్దతు పలికి కాపులను నిరాశపరిచారు. సరే... పార్టీ సంస్థాగతంగా బలోపేతం కాలేదన్న భావనతో మరింత కాలం పాటు వేచి చూద్దామని భావించిన కాపులు 2019 ఎన్నికల్లో జనసేనకు మద్దతుగా నిలిచారు. అయితే ఎన్నికల వరకు బాగానే సాగిన పవన్.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ... తన అసలు సిసలు రూపాన్ని బయటపెట్టుకుని టీడీపీకి దూరంగా జరిగినా కూడా ఆ పార్టీకి లోపాయికారి మద్దతు ప్రకటించారు. ఈ పరిణామంతో ఏం చేయాలో పాలుపోని కాపులు... పవన్ వెంటే నడిచినా ఓట్లు మాత్రం చీలిపోయాయి.ఎన్నికల క్షేత్రమన్నాక గెలుపోటములు సహజమేనన్న భావనతో సాగుతున్న కాపులు... 2024 ఎన్నికల్లో అయినా పవన్ ప్రభంజనం సృష్టిస్తారని - అప్పుడు కూడా తామంతా ఆయన వెన్నంటే నడవాలన్న భావనతో సాగుతున్నారు. అయితే కాపుల మనోభావాలకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వని పవన్... తన పార్టీని ఇప్పుడు బీజేపీతో కలిపేందుకో - లేదంటే... బీజేపీతో కలిసి నడిచేందుకో సిద్ధపడుతున్నారు. ఈ పరిణామం కాపులకు మరోమారు మోసం చేయడమేనన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరు వ్యక్తుల కారణంగా కాపులు ఏకంగా రెండు సార్లు మోసపోయారన్న మాట.