Begin typing your search above and press return to search.
చిరంజీవి. శ్రీవారి భక్తులను ఇబ్బంది పెట్టేశాడు.!
By: Tupaki Desk | 12 July 2015 2:00 AM GMTమళ్లీ పాత గొడవే.. వీఐపీలకు టీటీడీ చేసే రాచమర్యాదలు సామాన్యభక్తులను ఇబ్బంది పెట్టాయి. వీకెండ్స్ లో రొటీన్ గా జరిగే తతంగం మళ్లీ రిపీట్ అయ్యింది. అయితే ఈ సారి మెగాస్టార్ చిరంజీవి పుణ్యాన సామాన్యభక్తులు ఇబ్బంది పెట్టారు. తనయుడు రాంచరణ్ తేజ ఆధ్వర్యంలో ప్రారంభమైన విమానయాన సంస్థకు సంబంధించిన విమానాలకు ప్రత్యేకపూజలు చేయించడానికి చిరంజీవి తిరుపతి వెళ్లారు. శనివారం ప్రత్యేక దర్శనంలో ఆయన శ్రీవారిని దర్శించుకొన్నారు.
ఈ సందర్భంగా సామాన్యుల క్యూలైన్లను ఆపివేయడం జరిగింది. దీంతో.. సామాన్యులకు ఇక్కట్లు తప్పలేదు. చిరంజీవి కోసం కొన్ని క్యూలైన్ల కదలికను ఆపివేయడమే గాక.. మరికొన్ని క్యూలైన్లలోకి జనాలను అనుమతించనే లేదు! దీంతో.. తీవ్ర ఇబ్బంది కలిగింది. క్యూలైన్లు ముందుకు కదిలేది లేకపోవడంతో.. కాంపార్ట్ మెంటులన్నీ నిండి జనాలు రోడ్లపైకి బారులు తీరారు. ఈ విధంగా మెగాస్టార్ ప్రత్యేకదర్శనం సామాన్య భక్తులను ఇబ్బంది పెట్టింది.
మరి ఈ శనివారం తిరుమలలో ఇలా ఇబ్బందులు పాల్జేసిన ఘనత కేవలం చిరంజీవిదే కాదు. తమిళనాడు గవర్నర్ రోశయ్యది కూడా. ఈ వీకెండ్ సాయంత్రాన ఆయన ప్రత్యేక దర్శనంలో శ్రీవారిని దర్శించుకొన్నాడు. ఆయన కోసం కూడా క్యూలైన్లను ఎక్కడిక్కడ ఆపేశారు. దీంతో సాయంవేళ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కూడా తిప్పలు తప్పలేదు. మొత్తానికి తిరుమలలో సెలబ్రిటీల వల్ల సామాన్యులకు కలిగే ఈ ఇబ్బందికి పరిష్కారమార్గమే లేకుండా పోయినట్టుంది!