Begin typing your search above and press return to search.
ఆ ముగ్గురు కలిసి ప్రచారం చేస్తే పండుగే..
By: Tupaki Desk | 6 Oct 2018 12:18 PM GMTటాలీవుడ్ ను ఏలిన జంటలు ఇప్పుడు పొలిటికల్ స్క్రీన్ మీద కలిసి ప్రచారం చేస్తే ఏమైనా ఉంటుందా.? కానీ ఆ అద్భుతం తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఆవిష్కృతమయ్యేందుకు అవకాశాలున్నాయి. కానీ ఆవిష్కృతమైతే మాత్రం అద్భుతమే..
చిరంజీవి-విజయశాంతి - బాలక్రిష్ణ-విజయశాంతి.. ఈ రెండు జంటలు టాలీవుడ్ లో హిట్ పెయిర్.. ఈ జంటలు తెలుగు సినిమా చరిత్రలోనే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాయి. మరి ఇప్పుడు పొత్తుల కూటమిలో వీరు ముగ్గురు ఒకే వర్గంగా ఏర్పడ్డారు. వీరు కలిసి ప్రచారం చేస్తే ఆ ప్రభావం భారీగా ఉంటుంది. ఇందులో బాలయ్య, విజయశాంతి కలవడం ఖాయమే అయినా చిరంజీవే ఇంకా నిర్ణయించుకోలేదు..
తెలంగాణలో మహాకూటమి పురుడుపోసుకున్నాక కాంగ్రెస్-టీడీపీ కలిసిపోయాయి. ఇప్పుడీ వైరపక్షాలు కలిసి పోటీ, ప్రచారం చేయాలని డిసైడ్ అయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్ తరఫున విజయశాంతి ప్రచార పర్వాన్ని మొదలుపెట్టారు. జోగులాంబ అమ్మ వారి నుంచి కత్తి దూసి మాటల తూటాలు పేల్చారు. ఇక ఈ మధ్యే ఖమ్మం జిల్లాలోని మూడు నియోజకవర్గాల పర్యటించి బాలయ్య ప్రచారంతో టీడీపీని ఓటేయాలని కోరారు. ఇక కాంగ్రెస్ మాజీ ఎంపీ మెగాస్టార్ చిరంజీవి కూడా వీరికి కలిస్తే దబిడ దిబిడే.. కానీ ఆయన రాజకీయాలకు దూరంగా ‘సైరా’ సినిమా చేసుకుంటున్నారు. స్వయంగా రాహుల్ వచ్చినా వెళ్లి కలువలేదు.
మహాకూటమి ప్రచార పర్వంలో బాలయ్య - విజయశాంతి కలువడం ఖాయమే.. ఇక చిరంజీవిని కూడా రప్పించి ప్రచారం చేయిస్తే కూటమికి మహా క్రేజ్ వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి చిరంజీవి ఒప్పుకుంటారా.? బాలయ్య, విజయశాంతి, చిరు కలిసి ప్రచారం చేస్తారా అన్నది వేచిచూడాల్సిందే..