Begin typing your search above and press return to search.
పవన్ ఒక్కడే యుద్ధం చేస్తాడట...మెగా క్యాంప్ నో పాలిటిక్స్....?
By: Tupaki Desk | 17 Jan 2023 2:30 AM GMTవచ్చే ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ కి ఎన్నికల్లో మెగా క్యాంప్ నుంచి మద్దతు ఎంతమేరకు దక్కుతుంది అన్న చర్చ ఒకటి ఉంది. మెగా క్యాంప్ లో ఆరేడు మంది హీరోలు ఉన్నారు. అదే విధంగా క్రిష్ణుడు లాంటి మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. ఆ మధ్యన చూస్తే మెగా ఫ్యాన్స్ అంతా విజయవాడలో సమావేశం జరిపి వచ్చే ఎన్నికల్లో ఐక్యంగా ఉండాలని నిర్ణయించారు. దీంతో మెగా హీరోలు కూడా పవన్ కి మద్దతు ఇస్తారని ప్రచారం అయితే సాగింది.
కానీ లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి దీని మీద పక్కాగా క్లారిటీ ఇచ్చేశారు. తాను ఆయుధం పట్టను, యుద్ధంలోకే అడుగు పెట్టను అని తేల్చేసారు. ఇదే నా ఫైనల్ డెసిషన్ అన్నారు. వాల్తేరు వీరయ్య సినిమా గురించిన ప్రమోషన్స్ లో ఆయన మాట్లాడుతూ ఒక యూ ట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాల్లో తన పాత్ర గురించి తేటతెల్లం చేశారు. నేను రాజకీయం గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడను అని పేర్కొన్నారు. రాజకీయాలు నా నా నుంచి దూరంగా లేవు అంటూ గాడ్ ఫాదర్ లో తన పాత్ర అంటుంది తప్ప తాను కాదు కదా అని ఆయన తెలివిగానే చెప్పుకొచ్చారు.
తన ఇంట్లో తమ్ముడు రాజకీయ పార్టీ పెట్టాడని, ఆయనకు ఒక అన్నగా తన బ్లెస్సింగ్స్ ఎపుడూ ఉంటాయని అంతమాత్రాన వీధికెక్కి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు అని ఆయన అన్నారు. ఇక మెగా క్యాంప్ లో ఉన్న ఆరేడు మంది హీరోలు కూడా ప్రచారం చేసే పరిస్థితి వస్తుంది అని తాను అనుకోవడంలేదు అని ఆయన చెప్పారు. దానికి కారణం పవన్ కళ్యాణే అని చెప్పడం విశేషం.
తన పార్టీ తరఫున ప్రచారం చేయడానికి ఎవరూ రావాలసిన అవసరం లేదని పవన్ చెప్పారని చిరంజీవి కొత్త విషయం చెప్పారు. తన రాజకీయాలు తన దోవ తనదని ఒంటరిగానే పోరాడుతాను అని కళ్యాణ్ చెప్పారని, తమ ప్రొఫెషన్స్ ఏవీ ఆయన రాజకీయాల వల్ల ఇబ్బంది పడకూడదని తమ్ముడు భావిస్తూ ఉంటాడని అందుకే అలా చెప్పారని చిరంజీవి అన్నారు.
ఇక తమ్ముడు రాజకీయ విజయావకాశాల గురించి చిరంజీవి మాట్లాడుతూ ఏమి చెప్పగలమని ఒక్క మాటలో తేల్చేశారు. రాజకీయాలు ఎపుడూ ఒకేలా ఉండవని, అవి అలా మారుతూ ఉంటాయని, బాగా పనిచేసినా రాజకీయాలలో ఫలితం ఎవరూ చెప్పలేరని, పైగా తాను పాలిటిక్స్ గురించి పెద్దగా స్టడీ చేసే స్థితిలో లేనని అన్నారు.
ఇవన్నీ పక్కన పెడితే జనసేన తరఫున మెగా హీరోలు వరసబెట్టి ఎన్నికల రంగంలోకి దిగితారంటూ ఆ మధ్య వచ్చిన వార్తలు ప్రచారానికి చిరంజీవి అయితే ఒక క్లారిటీ ఇచ్చారనే అంటున్నారు. అంటే మెగా ఫ్యామిలీ నుంచి కేవలం నాగబాబు తప్పించి ఎవరూ పవన్ వెంట కనిపించరన్న మాట. అయితే మెగా ఫ్యామిలీ మోరల్ సపోర్ట్ మాత్రం పవన్ కే అన్నది వాస్తవం. ఏది ఏమైనా రేపటి ఎన్నికల్లో నందమూరి హీరోలు మెగా హీరోలు అంతా కలసి ఏపీలో సందడి చేస్తారు అనుకుంటునన్ వేళ మెగాస్టార్ మాటలు ఆలోచించుకోవాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.