Begin typing your search above and press return to search.
కన్నీళ్లతో పీఆర్పీ గురించి చెప్పిన చిరంజీవి
By: Tupaki Desk | 2 May 2018 1:36 PM GMTప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు - మెగాస్టార్ చిరంజీవి ఒకింత ఉద్విగ్నతకు లోనయ్యారు. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) సిల్వర్ జూబ్లీ సంబరాల కోసం అమెరికాలోని డల్లాస్ కు చిరంజీవి వెళ్లిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 28న నిర్వహించిన ఈ వేడుకలకు హాజరైన అనంతరం జరిగిన సమావేశంలో చిరంజీవి ఈ ఉద్విగ్నతకు గురయ్యారు. 'తానా' నిర్వహిస్తోన్న పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి అమెరికా వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి డల్లాస్ లో నిర్వహించిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని వారు చూపించిన అభిమానానికి భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. తన సినీ జీవితంతో పాటు రాజకీయ రంగం గురించి కూడా ఆయన వెల్లడించారు.
ఈ మధ్య తన మనసుని తాకిన ఆప్యాయ, ఆత్మీయ సమావేశం ఏదైనా ఉందంటే ఇక్కడ మీరు ఏర్పాటు చేసిన ఈ సమావేశమే అని చిరంజీవి పేర్కొన్నారు. `తానా వారి ఆహ్వానంతో అమెరికాకు వచ్చాను. ఇక్కడి కొంతమంది అభిమానులు నన్ను కలవాలని అనుకుంటున్నారని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. దీంతో వచ్చాను.. ఇక్కడ కానా పేరుతో ఓ అసోసియేషన్ ఉందని కూడా నాకు ఇప్పటివరకు తెలియదు. కానా అసోసియేషన్ ఏర్పాటుతో అనేక కార్యక్రమాలు చేపడం నాకు స్ఫూర్తిని కలిగిస్తోంది. ఎంతో మందికి స్పూర్తిని కలిగిస్తూ మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు. మిమ్మల్ని చూస్తుంటే నిశ్శబ్ధ సైనికులు అని నమ్ముతున్నారు. ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా గుర్తింపు కోసం కాకుండా సంతృప్తి కోసం పనిచేయడం నాకు స్ఫూర్తిని కలిగిస్తోంది. మీరు నాకు స్ఫూర్తి ప్రధాతలు. ఒకవేళ ఈ కార్యక్రమంలో పాల్గొనకపోయి ఉంటే చాలా కోల్పోయేవాడిని" అని చిరంజీవి భావోద్వేగంతో మాట్లాడారు.
రాజకీయాల్లోకి వచ్చి తాను ఓటమిపాలు కాలేదు, దిగజారలేదని చిరంజీవి ఉద్వేగంగా ప్రసంగించారు. సమాజంలోని అసమానతలను రూపుమాపాలని - సామాజిక న్యాయం చేయాలని ప్రజలకు ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన జీవితాన్ని అందించాలనే కోరిక ఉండేది. ఈ నేపథ్యంలో అభిమానుల కోరిక మేరకు రాజకీయాల్లోకి వచ్చాను. అయితే 18 మంది ఎమ్మెల్యేలే గెలవడంతో ఆలోచనలో పడ్డానని అయితే ప్రజల తీర్పును అర్థం చేసుకున్నాను` అని చిరంజీవి వివరించారు. సామాజిక బాధ్యతను నెరవేర్చడం జాతీయ పార్టీలతోనే సాధ్యమవుతుందని భావించి తమ పార్టీని విలీనం చేశానని ఈ సందర్భంగా మెగాస్టార్ వివరించారు. రాజకీయంగా ముందుకెళ్లాను తప్ప దిగజారలేదు.. పక్కదారి పట్టలేదు అని ఉద్వేగంగా చిరంజీవి వెల్లడించారు. రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా, కేంద్రమంత్రిగా ప్రజాసేవలో విజయం సాధించాను అని వివరించారు.