Begin typing your search above and press return to search.
జగన్ మాట చిరంజీవి మాటా ఒక్కటే..
By: Tupaki Desk | 11 Jun 2016 7:36 AM GMTవైసీపీ అధినేత జగన్ - కాంగ్రెస్ నేత చిరంజీవి ఇద్దరూ ఒకే మాట చెబుతున్నారు. కాపు గర్జన సందర్భంగా తునిలో జరిగిన హింసాకాండ విషయంలో విచారణను సీబీఐతో జరిపించాలని వైసీపీ అధినేత జగన్ కోరుతున్న సంగతి తెలిసిందే. తాజాగా చిరంజీవి కూడా అదే పాట పాడుతున్నారు. ముద్రగడ అరెస్టు అమానుషమని, తుని ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు.ముద్రగడ దీక్షకు దిగిన సందర్భంగా పోలీసులు ఆయన పట్ల వ్యవహరించిన తీరుపైనా చిరంజీవి ఆక్షేపణ వ్యక్తంచేశారు. ముద్రగడను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని తాను ఖండిస్తున్నట్లు కూడా చిరంజీవి తన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం ముద్రగడపై వ్యవహరిస్తోన్న తీరు కక్ష సాధింపు చర్యలా ఉందని ఆయన ఆరోపించారు.
కాగా ముద్రగడ విషయంలో చిరంజీవి జోక్యంతో వ్యవహారంలో వేడి పెరిగింది. ముద్రగడ రెండో విడత దీక్ష మొదలైన తరువాత ఇప్పటివరకు స్పందించని చిరంజీవి తాజాగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. చిరంజీవికి ముఖ్య అనుచరుడిగా పేరున్న ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య కాపు ఉద్యమాన్ని ఎలాంటి మార్గం పట్టించాలన్న విషయం చర్చించేందుకు చిరంజీవిని కలిశారు. అదేసమయంలో చిరంజీవి చంద్రబాబుకు లేఖ రాయడం కూడా జరిగింది.
మరోవైపు ప్రభుత్వం కూడా ముద్రగడ దీక్షను నిశితంగా పరిశీలిస్తోంది. ఆసుపత్రిలో ఆయనకు ప్రత్యేక వైద్యసేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య - ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. ముద్రగడకు ప్రత్యేక వైద్య సేవలు అందించడానికి కాకినాడ ప్రభుత్వ బోధనాసుపత్రి నుంచి రిస్క్ ఎసెస్ మెంట్ బృందాన్ని ముద్రగడకు చికిత్స అందించడానికి తీసుకొస్తున్నారు. ఈ బృందంలో నలుగురు సీనియర్ వైద్యులు ఉన్నారు. అయితే, ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన వైద్యానికి నిరాకరిస్తుండడం కథ మొదటికొస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు బలవంతంగానైనా ఆయనతో దీక్ష విరమింపజేసి చికిత్స అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.