Begin typing your search above and press return to search.
కష్టమంతా రఘువీరాది..క్రెడిట్ చిరంజీవికి..
By: Tupaki Desk | 27 July 2015 9:51 AM GMT కొన్నాళ్లుగా అంటీముట్టనట్లుగా ఉన్న కాంగ్రెస్ నేత చిరంజీవి మొన్న రాహుల్ గాంధీ పర్యటనలో హడావుడి చేసిన సంగతి తెలిసిందే... ఆయన రాహుల్ తో పాటే పాదయాత్రలో పాల్గొనడంతోపాటు ఆకట్టుకునేలా ప్రసంగించి రాహుల్ ను ఆకట్టుకున్నారు.దారుణమైన కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటీవల కాలంలో ఇంతగా సక్సెస్ అయిన కార్యక్రమం ఇదే. అయితే.... దీని వెనుక పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కృషి ఉంది. విభజన తరువాత ఎవరూ తోడు లేకున్నా ఒంటరిగానే పోరాడుతున్న ఆయన రాహుల్ పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేశారు. ఇంకా చెప్పాలంటే ఆయనకు ఎవరూ పెద్దగా సహాయపడలేదు కూడా. కానీ... తీరా రాహుల్ వచ్చేసరికి మాత్రం చిరంజీవి మొత్తం కమ్మేశారు. ఆయన చేసిన హడావుడికి రాహుల్ కూడా ఢంగైపోయారు. అయితే... చిరంజీవికి సినీనటుడిగా ఇంకా క్రేజు తగ్గకపోవడంతో ఆయనకు జనం బ్రహ్మరథం పట్టారు. ఇంకా చెప్పాలంటే రాహుల్ కంటే చిరంజీవితోనే కార్యకర్తలు చేతులు కలిపేందుకు పోటీ పడ్డారు. దీంతో చిరంజీవికి ప్రజల్లో ఉన్న క్రేజ్‌ను గుర్తించిన రాహుల్ గాంధీ, పార్టీ పునర్నిర్మాణంలో ఆయన సేవలను వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవాలని తీర్మానించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు చిరంజీవి క్రియాశీలంగా వ్యవహరించేలా చూడాలని ఏపీసీసీ వర్గాలకు సూచించారట.
దీంతో ఏపీ కాంగ్రెస్ లో కొత్త ఊహాగానాలు వస్తున్నాయి. పీసీసీ బాధ్యతలు చిరంజీవికి అప్పగిస్తారన్న ప్రచారం ఊపందుకుంటోంది. అయితే.. అదేసమయంలో రఘువీరారెడ్డికి కొందరు మద్దతుగా మాట్లాడుతున్నారు. రాహుల్ పర్యటన సక్సెస్ కావడానికి రఘువీరాయే కారణమని... ఏడాదిగా ఒంటరి పోరాటం చేస్తున్న ఆయన్ను తప్పించి చిరంజీవికి ఇస్తే పార్టీ నష్టపోతుందని అంటున్నారు. అంతేకాదు... రఘువీరా కష్టపడి ఈ పర్యటనను విజయవంతం చేస్తే చిరంజీవి క్రెడిట్ దక్కడం సరికాదంటున్నారు.