Begin typing your search above and press return to search.
పవన్ ఎఫెక్ట్- రాహుల్ తో చిరంజీవి భేటీ
By: Tupaki Desk | 25 Jan 2018 6:04 AM GMTతెలుగు రాజకీయాలకు సంబంధించి ఢిల్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కేంద్ర మాజీ మంత్రి - ఎంపీ చిరంజీవి భేటీ అయ్యారు. చిరంజీవి సోదరుడు - జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ నుంచి యాత్ర ప్రారంభించిన నేపథ్యంలో రాహుల్ గాంధీతో చిరు భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. రాహుల్ తో సమావేశం సందర్భంగా పలు అంశాలపై చిరంజీవి మాట్లాడారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తన తాజా చిత్రం షూటింగ్ పూర్తయిన తరువాత ఏపీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటానని రాహుల్ కు ఆయన చెప్పినట్టు తెలిసింది.
2019లో జరిగే లోక్ సభ - అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తానని కాంగ్రెస్ ఎంపీ వెల్లడించారు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను పటిష్టం చేయాలని రాహుల్ గాంధీ పట్టుదలతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే సీనియర్ నాయకుడు - కీలకమైన కాపు సామాజికవర్గానికి చెందిన చిరంజీవిని కలిసినట్లు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని పటిష్టం చేసేందుకు రాహుల్ ఒక ప్రత్యేక వ్యూహాన్ని రచిస్తున్నారని ఈ విషయాన్ని చిరంజీవితో చర్చించారని అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ఉధృతం చేయడం,ఈ క్రమంలో చిరంజీవి పాత్ర గురించి చర్చించినట్లు సమాచారం.
త్వరలో తాను ఏపీలో పర్యటిస్తానని కూడా ఈ సందర్భంగా రాహుల్ గాంధీ చిరుతో పేర్కొన్నట్లు తెలుస్తోంది. పార్టీ బలోపేతం కోసం ఏపీలోని నాయకులు కృషి చేయాలని, ముఖ్యనాయకులు ఐక్యంగా ఉండాలని రాహుల్ చెప్పినట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్నందున ఇందుకు తగిన కార్యాచరణతో నాయకులు ముందుకు సాగాలని రాహుల్ కోరినట్లు తెలుస్తోంది. కాగా, ఏపీలో బీజేపీ బలోపేతం - అధికార టీడీపీ - కాపు రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. జనసేన పాత్ర గురించి కూడా రాహుల్ చిరంజీవితో చర్చించినట్లు సమాచారం.