Begin typing your search above and press return to search.
తొడ కొడుతున్న మేనల్లుడు...బాబు ఎఫెక్ట్...?
By: Tupaki Desk | 6 May 2022 11:30 PM GMTఆయన మేనమామ అడుగు జాడల్లో రాజకీయ ఓనమాలు దిద్దాడు. మామ గెలుపు కోసం పనిచేశాడు. ఒక విధంగా మేమమామకు సిసలైన వారసుడిగా ఎదిగాడు. ఆయనే శ్రీకాకుళం జిల్లా టీడీపీ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్. తమ్మినేని 2004 వరకూ టీడీపీలోనే ఉండేవారు. ఇక 2008 నాటికి ఆయన ప్రజారాజ్యంలో చేరిపోయారు. తనతో వస్తాడనుకున్న మేనల్లుడు నాడు టీడీపీలోనే ఉండిపోయాడు. ఆ విధంగా కూన టీడీపీలో కొనసాగుతూ పసికూన కానే కాదు అనిపించేశాడు.
తమ్మినేని ప్రజారాజ్యంలో చేరినా ఆముదాలవలసలో గెలుపు దక్కలేదు. 2014లో ఆయన వైసీపీలో చేరి పోటీ చేస్తే సొంత మేనల్లుడి చేతిలో పరాభవం పలుకరించింది. అయితే దానికి బదులు అన్నట్లుగా 2019 ఎన్నికల్లో తమ్మినేని సీతారామ్ గెలిచి తానేంటో నిరూపించుకున్నారు. ఈ దఫా అధికార వైభోగంతో ఆముదాలవలసను తన కొడుకు సిసలైన వారసుడు తమ్మినేని చిరంజీవి నాగ్ కి అప్పగించాలని ఆయన తలచారు.
అయితే ఆయనకు మంత్రి పదవి దక్కలేదు, స్పీకర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరో వైపు చూస్తే కూన ఏ మాత్రం తగ్గలేదు. మూడేళ్ళుగా బిగ్ సౌండ్ చేస్తూనే ఉన్నాడు, వరసబెట్టి అరెస్టులు చేసినా అదరలేదు, బెదరలేదు, మొత్తానికి ఆయనకు చంద్రబాబే బలం, బలగం. దాంతో ఏం చేసుకుంటే చేసుకోండని వైసీపీ వారి మీద రెచ్చిపోతూ వచ్చారు.
ఇవన్నీ ఇలా ఉంటే చంద్రబాబు ఉత్తరాంధ్రా టూర్ లో ఫస్ట్ ప్రోగ్రాం తమ్మినేని ఇలాకాలోనే పెట్టించి కూన తన తడాఖా చూపించారు. ఈ సభకు జనం వెల్లువలా పోటెత్తారు. దాంతో తమ్మినేని శిబిరంలో అలజడి రేగుతోంది. ఇప్పటికే వైసీపీ వారి అనధికార సర్వేలలోనూ సిక్కోలులో వెరీ వీక్ సీటు ఆముదలవలస అని తేలుతున్న వేళ చంద్రబాబు అక్కడకు వచ్చి సభ పెట్టి మరీ టీడీపీని ఇంకా స్ట్రాంగ్ చేసి పారేశారు.
ఇపుడు ఆముదాలవలస వైసీపీలో ఆందోళన రేగుతోంది. దాంతో ఎదురుదాడికి రెడీ అయిపోయారు. చంద్రబాబుని వెన్నుపోటుదారుడు అంటూ తమ్మినేని వారసుడు చిరంజీవి నాగ్ లేటెస్ట్ గా మీడియా మీటింగ్ పెట్టి మరీ ఘాటు పదజాలంతో విమర్శలు చేశారు. జిల్లా టూర్ లో ఎన్టీయార్ విగ్రహానికి పూలదండలు వేయకుండా చంద్రబాబు తన వెన్నుపోటు నైజాన్ని చాటుకున్నారు అని విమర్శించారు. బాబు తన పక్కన ఇసుక మాఫియా డాన్ కూన రవికుమార్ ని పెట్టుకుని వైసీపీని విమర్శించడమేంటి అని తమ్మినేని వారసుడు గట్టిగా అడిగేశారు.
తన ఏలుబడిలో ఏ ఒక్క పధకం అయినా బాబు ప్రవేశపెట్టారా. నికరంగా సిక్కోలుకు ఆయన చేసిన మేలు ఏంటి, ఇచ్చిన ప్రాజెక్ట్ ఏంటి అని కూడా నిలదీశారు. మొత్తానికి బాబు పెట్టిన మీటింగ్ ఎఫెక్ట్ తమ్మినేని ఫ్యామిలీ మీద పొలిటికల్ గా బాగా పడింది అంటున్నారు. చూడాలి మరి మేనల్లుడు అటు వైపు మోహరించి తొడకొడుతున్నాడు. ఇటు తమ్మినేని వారి చిరంజీవి నిలబడి సత్తా చూపగలరా అంటే వెయిట్ అండ్ సీ.