Begin typing your search above and press return to search.
చిరంజీవిపై ఆశలు వదులుకున్న కాంగ్రెస్!
By: Tupaki Desk | 5 Jun 2017 6:14 AM GMTకాంగ్రెస్ నేత - కేంద్ర మాజీ మంత్రి - రాజ్యసభ సభ్యుడు చిరంజీవిపై ఆ పార్టీ నాయకత్వం ఆశలు వదులుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు... ఆయన త్వరలో అధికారికంగా కాంగ్రెస్ కు కటీఫ్ చెబుతారనీ కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తోంది. చాలాకాలంగా పార్టీకి అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న ఆయన త్వరలో పార్టీకి గుడ్ బై చెప్పేస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్ గుంటూరులో ప్రత్యేక హోదా బహిరంగసభ ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం... ఆ సభకు రాహుల్ గాంధీతో పాటు శరద్ యాదవ్ - అఖిలేష్ యాదవ్ - ఆర్జేడీ - సీపీఐ నేతలు సురవరం సుధాకర్ రెడ్డి - డి.రాజాతో పాటు డిఎంకె నేతలు హాజరుకావడం తెలిసిందే... అంతమంది వచ్చినా చిరంజీవి మాత్రం రాలేదు. ఎంతో ముందుగానే డిసైడైన ఈ కార్యక్రమానికి చిరంజీవి రాకపోవడం అన్నది ఆయన వైఖరిపై క్లారిటీ ఇచ్చేసింది.
ఈసభ ఏర్పాట్ల కోసం, రాహుల్ ను ఏపీ పర్యటనకు ఆహ్వానించేందుకు కాంగ్రెస్ నేతలు ఇంతకుముందు ఢిల్లీ వెళ్లారు. అప్పుడు కూడా చిరంజీవి వారితో వెళ్లలేదు... దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చిరు సభకు వస్తారని కాంగ్రెస్ నేతలు అప్పుడు సర్ధిచెప్పారు. అయితే తీరా చూస్తే మాత్రం ఆయన సభకు రాలేదు. ఈ వరుస పరిణామాలు చూస్తే కాంగ్రెస్ కు ఆయన దూరమవుతున్నారని ప్రచారం నడుస్తోంది.
అయితే ఏపీ కాంగ్రెస్ నేతలు ఇంకా సర్ది చెప్పడానికే ట్రై చేస్తున్నారు. చిరంజీవి కుటుంబసమేతంగా హాలిడే కోసం చైనా వెళ్లారని..అందుకే రాలేకపోయారని వారు అంటున్నారు. దాసరి నారాయణ రావు చనిపోయినప్పుడు కూడా ఆయన రాలేదని…చైనా టూర్ లో ఉండడం వల్లే వెనక్కి రాలేకపోయారని వారు వివరిస్తున్నారు. ఎన్ని మాటలు చెప్పుకున్నా కూడా జరుగుతున్న పరిణామాలు మాత్రం చిరంజీవికి - కాంగ్రెస్ కు బంధం తెగిపోయినట్లేనని సూచనలిస్తుున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/