Begin typing your search above and press return to search.

చిరు కాపుల‌కే నాయ‌కుడా?

By:  Tupaki Desk   |   8 Feb 2016 9:51 AM GMT
చిరు కాపుల‌కే నాయ‌కుడా?
X
నాయ‌కుడు అన్న వాడు త‌న‌ను న‌మ్ముకున్న వారందరి కోసం ప‌ని చేయాలి. వారికి ఏదైనా స‌మ‌స్య వ‌స్తే స్పందించాలి. వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం పోరాడాలి. వారంద‌రికి తాను ఉన్నాన‌న్న భ‌రోసాను క‌ల్పించాలి. ఇది చాలా అవ‌స‌రం. కానీ.. కొన్ని విష‌యాల‌కే స్పందించే చిరంజీవి వైఖ‌రి ఇప్పుడు చాలా ప్ర‌శ్న‌ల్నే రేపుతోంది. ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క‌భూమిక పోషించాల‌ని భావిస్తున్న చిరంజీవి గ‌త కొద్ది రోజులుగా కామ్‌ గా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. ఏపీలో ఈ మ‌ధ్య కాలంలో చాలానే ఇష్యూలు తెర‌పైకి వ‌చ్చినా.. వేటి విష‌యంలోనూ పెద్ద‌గా స్పందించ‌ని ఆయ‌న తాజాగా కాపుల్ని బీసీల్లోకి చేర్చాల‌న్న అంశంపై రియాక్ట్ కావ‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది.

కాపు వ‌ర్గానికి చెందిన చిరంజీవి ఈ ఇష్యూలో స్పందించ‌టం పెద్ద విశేషమేమీ కాదు. కానీ.. అంద‌రికి ఆమోద‌యోగ్య‌మైన నేత‌గా ఉండాల్సిన వ్య‌క్తి ఒక వ‌ర్గానికి చెందిన అంశంపై ఆందోళ‌న జ‌రుగుతున్న వేళ స్పందించిన వ్య‌క్తి.. మిగిలిన విష‌యాల్లోనూ అంతే స్పీడును ఎందుకు ప్ర‌ద‌ర్శించ‌లేద‌న్న‌ది ప్ర‌శ్న‌. ఏపీ రాజ‌ధాని ఇష్యూలో కావొచ్చు.. కాల్ మ‌నీ వ్య‌వ‌హారంలో కావొచ్చు.. చాలానే ఇష్యూలు ఈ మ‌ధ్య కాలంలో తెర‌పైకి వ‌చ్చాయి. ఏ సంద‌ర్భంలోనూ పెద్ద‌గా రియాక్ట్ కాని చిరంజీవి కాపుల ఇష్యూలో ప్ర‌త్యేక విమానంలో రాజ‌మండ్రికి వెళ్ల‌టం గ‌మ‌నార్హం. ఇలాంటివి చిరు ఇమేజ్‌ ను డ్యామేజ్ చేస్తాయ‌ని చెబుతున్నారు. తాజా ఘ‌ట‌న‌తో ఆయ‌న అంద‌రి నాయ‌కుడిగా కంటే కూడా కొంద‌రి నాయ‌కుడిగా మిగిలార‌న్న మాట వినిపిస్తోంది. మిగిలిన వ‌ర్గాల ఇష్యూల మీద క‌నీసం స్పందించ‌ని చిరు.. తాజా ఎపిసోడ్‌లో చివ‌ర్ లో రియాక్ట్ అయి త‌ప్పు చేశార‌న్న మాట వినిపిస్తోంది. తాజా ఉదంతం ఆయ‌న్ను కాపుల‌కు ప్రాతినిధ్యం వ‌హించే నేత‌గా మార్చింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.