Begin typing your search above and press return to search.

'అన్న‌య‌' తో జ‌న‌సేన‌కు పెరిగే జోష్ ఎంత‌?

By:  Tupaki Desk   |   4 Oct 2022 5:30 PM GMT
అన్న‌య‌ తో జ‌న‌సేన‌కు పెరిగే జోష్ ఎంత‌?
X
అన్న‌య్య మెగాస్టార్ స్ప‌ష్టం చేసేశారు. కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌కు నేనున్నానంటూ.. ఆయ‌న ముసు గు తీసేశారు. అవ‌స‌రం అనుకుంటే.. నేను అండ‌గా ఉండొచ్చేమో! అని ఆయ‌న వ్యాఖ్యానించారు. సో.. ఈ ప‌రిణామం.. స‌హ‌జం గానే జ‌న‌సేన‌లో జోష్ నింపుతోంది. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు `జ‌న‌సేన` గురించి కానీ, ప‌వ‌న్‌ రాజ‌కీయాల గురించికానీ, చిరు ఎక్క‌డా ఏ వేదిక‌పైనా స్పందించింది లేదు. పైగా.. ఒక‌వైపు.. ప‌వ‌న్ ప్ర‌భుత్వాన్ని త‌ప్పుబ‌డుతున్న స‌మ‌యంలో ఆయ‌న నేరుగా సీఎం జ‌గ‌న్‌నుక‌ల‌వ‌డం.. ఆయ‌న‌తో క‌లిసి విందు ఆర‌గించ‌డం.. వంటివి దుమారం రేపాయి.

దీనిని బ‌ట్టి.. చిరు నిజంగానే రాజ‌కీయాల నుంచి త‌ప్పేసుకున్నార‌ని కూడా.. ఓ వ‌ర్గం.. భావించింది. అంతేకాదు.. చిరు ఏం మాట్లాడినా.. దానిని త‌మ‌కు అన్వ‌యం చేసుకుని.. ముందుకు సాగిన వైసీపీ నాయ‌కులు కూడా ఉన్నారు. ఇక‌, సాయిరెడ్డి వంటివారు.. చిరును పొగిడిన తీరు కూడా.. చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇలాంటి స‌మ‌యంలో.. అనూహ్యంగా నేను.. అవ‌స‌రం అనుకుంటే.. ప‌వ‌న్ వెనుక ఉండొచ్చేమో!! అంటూ.. చిరు వ్యాఖ్యానించ‌డం.. జ‌న‌సేన‌లో అనూహ్య‌మైన జోష్‌ను పెంచింద‌నే చెప్పాలి. అయితే. ఈ జోష్ వ‌ల్ల .. జ‌న‌సేన‌కు వ‌చ్చే లాభం ఎంత‌? ఏమేర‌కు ఓటు బ్యాంకు పెరుగుతుంద‌నేది ఇప్పుడు ప్ర‌శ్న‌.

ఎందుకంటే.. రాజకీయాల్లోకి ఎవ‌రు వ‌చ్చినా.. ఏ అడుగు వేసినా.. అంతిమంగా.. ఎవ‌రైనా ఆశించేది.. ఓటు బ్యాంకే.. అధికార పీఠ‌మే. సో.. దీనిని త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. అయితే.. కొంద‌రికి ఇది ముందుగానే ల‌క్ష్యంగా ఉంటుంది. జ‌న‌సేన వంటి పార్టీల‌కు.. అంతిమ ల‌క్ష్యం కాక‌పొవ‌చ్చు. ఈ నేప‌థ్యంలో చిరు తాజా ప్ర‌క‌ట‌న‌.. వ‌ల్ల‌.. జ‌న‌సేనకు వ‌చ్చే ఓటు బ్యాంకుపై అప్పుడే చ‌ర్చ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. కాపు సామాజిక వ‌ర్గం.. గుండుగుత్తగా.. చిరంజీవి వెంట ఉంద‌నే అభిప్రాయం ఉంది. ఆయ‌నను ఇప్ప‌టికీ అభిమానిస్తూనే ఉన్నారు. ఇక‌, మాస్‌లోనూ.. చిరు ఫేమ్ ఎక్క‌డా త‌గ్గ‌లేదు.

అయితే..దీనిని రాజ‌కీయంగా మార్చుకోవాల్సిన‌, మ‌లుచుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అదేస‌మ‌యంలో క్షేత్ర‌స్తాయిలోనూ.. జ‌న‌సేన‌ను ముందుకు న‌డిపించేందుకు అనేక ప్ర‌య‌త్నాలు చేయాల్సి ఉంది. ఇది జ‌రిగితే.. అప్పుడు.. జన‌సేన‌కు నిజంగానే మైలేజీ ఓట్ల‌రూపంలో రాల‌డం ఖాయమ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

యువ‌త‌, అభిమానులను జ‌న‌సేన వైపు మ‌ళ్లించే ప్ర‌య‌త్నంలో స‌క్సెస్ అయితే.. ఇక‌, తిరుగు లేద‌ని.. చెబుతున్నారు. ప్ర‌స్తుతం జ‌నసేన‌కు 7 శాతం ఓటు బ్యాంకు ఉంది. చిరు ఫ్యామిలీ క‌లిస్తే.. ఇది 25 శాతం వ‌ర‌కు ప‌రుగులు పెట్టే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. దీంతో ప‌వ‌న్‌కు మెరుగైన దారి ఏర్ప‌డ‌డంతోపాటు.. అధికారంలోకి వ‌చ్చే సే ఛాన్స్‌ను కూడా తోసిపుచ్చ‌లేమ‌ని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.