Begin typing your search above and press return to search.

తమ్ముడి పాలిటిక్స్ మీద చిరు మాటేమిటంటే..

By:  Tupaki Desk   |   11 Jan 2017 6:18 AM GMT
తమ్ముడి పాలిటిక్స్ మీద చిరు మాటేమిటంటే..
X
తన కెరీర్ లో మైల్ స్టోన్ లాంటి ఖైదీ నంబరు 150 సినిమా ప్రమోషన్ లో భాగంగా.. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా మైలేజీ వచ్చే ఉన్న ఏ చిన్న అవకాశాన్ని మెగాస్టార్ చిరంజీవి వదల్లేదని చెబుతున్నారు. దీంతో.. గడిచిన రెండు రోజుల్లో ఆయన సినిమాకు చెందిన వార్తలు.. విశేషాలు.. ఇంటర్వ్యూలతో పత్రికలు.. ఛానళ్లు.. వెబ్ సైట్లు నిండిపోతున్నాయి.

ఒకరి తర్వాత మరొకరన్నట్లుగా పలు ఛానళ్లకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చిన నేపథ్యంలో.. చిరును పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇలాంటివాటిలో కొన్ని ప్రశ్నలు ఆసక్తికరంగా ఉంటున్నాయి. అలాంటి ప్రశ్నే ఒకటి చిరుకు ఎదురైంది. తమ్ముడు పవన్ కల్యాణ్ పొలిటికల్ కెరీర్ గురించి అడిగిన ప్రశ్నకు చిరు సమాధానం ఇచ్చారు.

పవన్ లాంటి మైండ్ సెట్ ఉన్న వారు రాజకీయాలకు పనికివస్తారా? అన్న ప్రశ్నకు చిరు బదులిస్తూ.. రాజకీయాల్లోకి వచ్చే నాయకులు ఇలానే ఉండాలి.. ఇలానే నడుచుకోవాలి.. ఇలానే మాట్లాడాలన్న రూల్స్ ఏమీ ఉండవన్నారు. ‘‘ఎలాంటి కేరక్టర్ అయిన వాళ్లైనా.. వారి భావం ఏంటి? వారి ఆశయాలేంటి? వారి అంతిమ లక్ష్యం ఏమిటి? అన్నదానిపైనే ఆధారపడి ఉంటుంది. అంతేకానీ వారి నడవడిక మీదనో.. వారి వ్యక్తిత్వం మీదనో కాదు.వాళ్లు అనుకున్నది ఎంతవరకు సాధిస్తారు. ఎంతవరకు వారనుకున్న ఆశయాల్ని నెరవేరుస్తారన్నది కాలమే చెబుతుంది’’ అని వ్యాఖ్యానించారు.

పవన్ కల్యాణ్ కు మాంచి ఫైర్ ఉందని.. నిజాయితీపరుడని.. చక్కటి ఐడియాలజీ ఉన్న వాడని.. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘అలాంటి వాళ్ల వల్ల ప్రక్షాళన జరుగుతుంది.ఒక రకంగా కొత్త రాజకీయాలకు అవకాశాలు లభిస్తాయి. అయితే.. అతను ఎంతవరకు సక్సెస్ అవుతారు? ఎంతవరకు అధికారాన్ని చేజిక్కించుకుంటారు?’’ అన్నది వెయిట్ చేయాల్సిందే అని చెప్పారు. పాలిటిక్స్ లోకి పవన్ లాంటోళ్లు రావాలని చాలామందే కాదు.. రాజకీయాల్లో ఉన్న తనలాంటి వారూకోరుకుంటున్నారంటూ తమ్ముడ్ని పొగిడేశారు మెగాస్టార్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/