Begin typing your search above and press return to search.
చిరంజీవి.. ఏ పార్టీలోనూ చేరరా?
By: Tupaki Desk | 15 Sep 2017 3:35 AM GMTతెలుగునాట సినీ రంగంలో మహానటుడు ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయి వ్యక్తిగా - అంతటి అభిమానాన్నిపొందిన హీరోగా అశేష ప్రేక్షకుల మన్ననలు పొందిన హీరో.. మెగాస్టార్ చిరంజీవి. దాదాపు 25 ఏళ్లపాటు నెంబర్ వన్ గా తెలుగు చిత్రసీమను ఏలిన ఈ హీరో 2009లో ప్రేమే మార్గం.. సేవే లక్ష్యం అంటూ ప్రజారాజ్యం పార్టీ పెట్టి రైలింజిన్ గుర్తుతో పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఆశించిన సీట్లు రాకపోయినా ఓట్ల శాతం పరంగా దాదాపు 18 శాతం సాధించిన సంగతి తెలిసిందే. కారణాలు ఏమైనప్పటికీ పార్టీని ఎక్కువ కాలం నడపలేక కాంగ్రెస్ లో విలీనం చేసి రాజ్యసభ ఎంపీతోపాటు కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో మరోమారు మంత్రి అయ్యే అవకాశాన్ని కోల్పాయారు. అయితే రాజ్యసభ పదవీకాలం 2018 వరకు ఉంది. ఆత్మహత్యాసదృశ్యం లాంటి నిర్ణయంతో రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో నామరూపాల్లేకుండా పోయిన సంగతి విదితమే. చిరంజీవి కాంగ్రెస్ లోనే ఉన్నప్పటికీ చురుకుగా మాత్రం లేరు. పైగా ఆ పార్టీ నిర్వహించే సమావేశాలకు హాజరవడం లేదు.
ఇదిలా ఉంటే రాష్ట్ర విభజన తర్వాత కాపులు రాష్ట్ర జనాభాలో దాదాపు 27 శాతంతో అతిపెద్ద కులంగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో గత ఎన్నికల్లో అన్నిపార్టీలు కాపు మంత్రాన్నే జపించాయి. హామీలిచ్చి ప్రజలను మోసం చేయడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు కాపులను బీసీల్లో చేరుస్తానని ఒక బూటకపు వాగ్ధానం చేశారు. మరోవైపు వైఎస్ జగన్.. కాపులకు 6 లోక్ సభ సీట్లు - 38 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. అయితే చివరిలో పవన్ కల్యాణ్ రావడంతో చావుతప్పి కన్ను లొట్ట బోయిందన్నచందంగా చంద్రబాబు ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. మళ్లీ 2019 ఎన్నికలే లక్ష్యంగా అన్నిపార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్తబ్ధుగా ఉన్న చిరంజీవిని లాగడానికి తెలుగుదేశం - వైఎస్సార్ సీపీలు ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. అయితే చిరంజీవి మంచి పాత్రలను పోషిస్తూ సినిమాలకే అంకితమవుతాడంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి, కొద్ది రోజుల కిందట ఒక వెబ్ చానల్ ఇంటర్వ్యూలో మెగా సోదరుడు నాగబాబు మాట్లాడుతూ దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు పవన్ కల్యాణ్.. అన్నయ్యను పార్టీలోకి ఆహ్వానించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టిన సంగతి విదితమే.
ఒకవేళ చిరంజీవి చేరితే వైఎస్సార్ సీపీలో చేరతారు కానీ.. తెలుగుదేశంలో ఎందుకు చేరతారనే అభిప్రాయం విమర్శకుల్లో వినిపిస్తోంది. ఎందుకంటే చిరంజీవి సామాజికవర్గానికి, చంద్రబాబు సామాజిక వర్గానికి మధ్య.. కోస్తా జిల్లాల్లో ఆధిపత్య పోరు నడుస్తుంటుంది. అంతేకాకుండా గతంలో చిరంజీవి థమ్సప్ యాడ్ చేస్తే విజయవాడలో చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవారు థమ్సప్ మానేసిన సంగతిని విమర్శకులు గుర్తు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కాపుల్లోనే కాకుండా పేదలు - బడుగు - బలహీనవర్గాల్లో రాబిన్ హుడ్ ఇమేజ్ ఉన్న వంగవీటి మోహన్ రంగాను అతి కిరాతకంగా చంపింది తెలుగుదేశం ప్రభుత్వమేనని ఈ కారణం రీత్యా కూడా చిరంజీవి తెలుగుదేశంలో చేరే అవకాశం లేదని వారంటున్నారు. అయితే చిరంజీవి మాత్రం తను ఏదైనా పార్టీలో చేరితే అభిమానులు చీలిపోతారని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కాపు సామాజికవర్గం కూడా చీలిపోతే జనసేనకు నష్టం కలుగుతుందని కాబట్టి రాజకీయాల నుంచి విరమించుకుంటానికే నిశ్చయించుకున్నట్లు సమాచారం.