Begin typing your search above and press return to search.
ప్రజారాజ్యం ఫెయిల్ కు చిరు చెప్పిన కారణం
By: Tupaki Desk | 22 Aug 2015 11:47 AM GMTతెలుగు సినిమా రంగంలో దశాబ్దాల పాటు మెగాస్టార్ చిరంజీవి టాప్ హీరోగా ఉన్నారు. చిత్ర పరిశ్రమలో మకుటం లేని మహారాజుగా వెలిగిన చిరంజీవి పాలిటిక్స్ లో మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యారు. తాజాగా షష్ఠిపూర్తి సందర్భంగా పలు మీడియాలకు ఇంటర్వూ లు ఇచ్చిన చిరు తాను రాజకీయంగా ఎందుకు ఫెయిల్ అవ్వాల్సి వచ్చిందో సమాధానం ఇచ్చారు.
సినిమాల్లో డైరెక్టర్ తో పాటు సరైన టీంను ఎంచుకుంటే సినిమాకు సక్సెస్ వస్తుందని..సినిమా అనేది లిమిటెడ్ సభ్యుల పరిధిలో మాత్రమే ఉంటుందని కానీ పాలిటిక్స్ లో సుధీర్ఘపోరాటం చేయాలని..నిత్యం విమర్శలకు సమాధానం ఇస్తూ...మనం విమర్శించుకుంటూ పోవాలన్నారు. పాలిటిక్స్ లో తననెవరు వెన్నుపోటు పొడవలేదని.... సరైన కోర్ టీమ్ ను ఎంపిక చేసుకోలేకపోవడమే తన ఓటమికి కారణమని ఒప్పుకున్నారు.
ప్రజలు తనను తిరస్కరించినా వారి తరఫున పోరాడేందుకు తానెప్పుడూ సిద్ధమేనని, ఇప్పటికీ ప్రజలు తనపై ఆదరాభిమానాలు చూపుతుతున్నారని అన్నారు. ప్రజలకు సేవ చేయడం అనేది తాను దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నానని...8 సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్నాచిత్రపరిశ్రమ ప్రముఖులందరు తాను ఎప్పుడు మళ్లీ సొంత సామ్రాజ్యానికి వస్తానా అని అడుగుతుంటారని..త్వరలోనే 150వ సినిమాతో వారి కోరిక నెరవేరుస్తానని చిరు చెప్పారు.