Begin typing your search above and press return to search.

పిండ ప్రదానం కూడా సరిగా చేయవా చిరు..?

By:  Tupaki Desk   |   23 July 2015 4:46 AM GMT
పిండ ప్రదానం కూడా సరిగా చేయవా చిరు..?
X
పని మొదలు పెట్టటం.. దాన్ని మధ్యలో వదిలేయటం చిరంజీవికి అలవాటా? రాజకీయాల్లో ఆయన అనుసరిస్తున్న వైఖరి చూస్తే అది నిజం అనిపించక మానదు. సమాజాన్ని.. రాజకీయాల్ని మార్చేస్తానని చెబుతూ ప్రజారాజ్యం పార్టీని స్టార్ట్ చేసి.. మధ్యలో ఆయనే మారిపోయి.. కాంగ్రెస్ లో పార్టీని కలిపేయటం మొదలు.. సమైక్య వాదనను వినిపించి..మధ్యలోనే దాన్ని అలా వదిలేయటం లాంటివెన్నో కనిపిస్తాయి.

మందికి సంబంధించిన విషయాన్ని అలా వదిలేసినా.. పుష్కరాల సందర్భంగా పితృకర్మల్లో భాగంగా చేసే పిండ ప్రదానమైనా సరిగా చేయలేదన్న విమర్శ వినిపిస్తోంది. పుష్కరాల సందర్భంగా పూర్వీకులకు పిండ ప్రదానం చేస్తుంటారు. బుధవారం రాజమండ్రికి వచ్చిన చిరంజీవి తన బావమరిది అలు అరవింద్.. దర్శకుడు బి.గోపాల్ తదితరులతో కలిసి వచ్చి.. పిండ ప్రదానాన్ని అసంపూర్ణంగా వదిలేయటం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

పిండ ప్రదానం విధుల్లో కీలకమైన పిండాల్ని గోదాట్లో కలపకుండా మెట్ల మీదనే వదిలేసి వెళ్లటంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఇలాంటిది మంచిది కాదని.. మధ్యలో వదిలేయకూడదని.. అలా వదిలేస్తే.. పితృదేవతలకు పుణ్యం రాదని చెబుతున్నారు. చిరంజీవి వదిలి వెళ్లిపోయిన పిండాల్సి.. అభిమానులు.. పారిశుద్ధ్య కార్మికులు కలిసి గోదాట్లో వేసిన పరిస్థితి. పుష్కర స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందన్నది టీవీ గొట్టాల ముందు గొప్పగా చెప్పిన చిరంజీవి.. పుష్కరాల్లో అత్యంత కీలకమైన పిండ ప్రదాన కార్యక్రమాన్ని మధ్యలో ఎందుకు వదిలేసినట్లో..?